దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. సమకాలీన అంశాలు, కరోనా వ్యాక్సిన్, పెండిగ్ లో ఉన్న బిల్లులు వంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పరస్పర మాటల తూటాలు పేల్చుకుంటూ రాజకీయంగా దూసుకెళ్తున్నారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు భేటీ కావటం ఇదే మొదటిసారి. బెంగాల్ రాష్ట్రంలో కరోనా క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీపై మమతా సర్కారు కాస్త దూకుడుగానే ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు దీదీ.
ఇక వ్యాక్సిన్ త్వరితగతిన రాష్ట్రానికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి విన్నవించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా మమతా పెండింగ్ లో ఉన్న బిల్లులపై, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చినట్లు సమాచారం. దీంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ పై కూడా ప్రధానితో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీ దీనిపై కొట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లి కొంత మంది ప్రతి పక్ష నేతలతో భేటీ కానునట్లు సమాచారం.
ఈ అంశంలోనే కేంద్రంపైన తీవ్ర ఒత్తిడి తెచ్చి దోషిగా నిలబెట్టేందుకు దీదీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందట. ఇక నాలుగు రోజుల మమతా పర్యటనలో కొన్ని కీలక అంశాలపై గళమెత్తనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక గత ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన సమరంలో ఎట్టకేలకు మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత లేకున్నా ప్రధానిని కలిశారు మమతా.