రహదారి మీద బీర్ ట్రక్కు బోల్తా పడడంతో స్థానిక మందుబాబులు పండగ చేసుకున్నారు. చేతికి దొరికినంత ఎత్తుకెళ్లారు.
రోడ్ల మీద ఏ కారో, లారీనో ప్రమాదానికి గురైతే అందులో ఉన్న వారికి ఏమైనా అయితే ఏం చేస్తారు. అంబులెన్స్ కి కాల్ చేసి ఆసుపత్రికి తరలిస్తారు. కానీ ప్రమాదానికి గురైంది ఏ బీరు బాటిళ్ల ట్రక్కో అయితే మానవత్వం మర్చిపోతారు. డ్రైవర్ కి దెబ్బలు తగిలాయి, ఆసుపత్రికి తీసుకెళ్దాం, అంబులెన్స్ కి కాల్ చేద్దాం అని అనుకోరు. రోడ్డు మీద బీరు ట్రక్కు బోల్తా పడింది రండ్రా మందు ఏరుకుందాం అని ఎగబడతారు. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. తమిళనాడులో ఓ బీర్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. బీర్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు బందరపల్లి ఫ్లై ఓవర్ ని క్రాస్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది.
దీంతో ట్రక్కులో ఉన్న కొన్ని బీరు బాటిళ్లు పగిలిపోయి రోడ్డంతా బీరు పారింది. విషయం తెలుసుకున్న స్థానికులు పరుగు పరుగున అక్కడకు చేరుకొని చేతికి దొరికినన్ని బీరు బాటిళ్లు తీసుకెళ్లారు. ఒక్కో మనిషి 4, 5 బీరు బాటిళ్లతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని.. ట్రక్కు డ్రైవర్ ను రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జేసీబీతో రోడ్డును క్లియర్ చేయించారు. అయితే ఒక పక్క జేసీబీతో రోడ్డు క్లియర్ చేస్తుండగా.. మరో పక్క నుంచి మందుబాబులు బీరు సీసాల కోసం ఎగబడ్డారు. సర్వీస్ లేన్ మీద నుంచి దూకి మరీ బీరు బాటిల్స్ ని తీసుకెళ్తున్నారు.
‘డెయ్ మీరేం మనుషులురా నాయనా’ అని పోలీసు అంటున్నా కూడా లెక్క చేయకుండా బీరు బాటిల్స్ ని తీసుకెళ్తున్నారు. ఇది చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మందు అంటే అంత కరువులో ఉంటారు జనాలు. మందు కోసం మనిషిని వదిలేస్తారు. ఇదే సీన్ విదేశాల్లో జరిగితే అక్కడ డ్రైవర్ కి సహాయం చేస్తారు. రోడ్డు శుభ్రం చేస్తారు. క్రమశిక్షణ అనేది ఎవరో నేర్పితే రాదు, నేర్చుకుంటే వస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Watch the frenzy on road when a truck carrying cartons of beer tipped over. #happyhours #beertruck #Tamilnadu #Video pic.twitter.com/Il28fGlmso
— IndiaToday (@IndiaToday) May 2, 2023