కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం షిర్డీసాయికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారమేంటో అర్థమవ్వక ట్రస్ట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటో ఏంటో తెలిస్తే.. మీరు బ్యాంకు అధికారులను తిట్టకుండా ఉంటారు. అదేంటో చూద్దామా..?
దేశంలో ఉన్న అత్యంత సంపన్న ఆలయాల్లో షిర్డీ సాయిబాబా టెంపుల్ ఒకటి. నిత్యం లక్షలాది భక్తులు మహారాష్ట్రలోని షిర్డీ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల తరువాత అత్యధికంగా షిర్డీ క్షేత్రానికి భక్తులు తరలివస్తుంటారన్న వార్తలు ఉన్నాయి. అలా సాయినాథుడి దర్శనార్థం వచ్చే భక్తులు.. తమకు తోచిన కానుకలను స్వామివారి హుండీల్లో వేస్తుంటారు. అలా భక్తులు హుండీలలో వేసిన చిల్లర నాణేలు కుప్పలు కుప్పలుగా పడిఉన్నాయట. వీటి విలువ కోట్లలో ఉంటుందట. వీటిని తీసుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారని సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక ట్రస్ట్ అధికారులు ఆర్బీఐని ఆశ్రయించినట్లు వార్తలొస్తున్నాయి.
శ్రీ సాయిబాబా ట్రస్ట్‌కి మొత్తం 13 ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఒక్క షిర్డీలోనే 12 ఖాతాలుండగా.. నాసిక్‌లో ఒకటి ఉంది. కానుకల ద్వారా వచ్సిన నగదును ట్రస్ట్ సిబ్బంది లెక్కించాక.. ఆ మొత్తాన్ని సదరు ఖాతాలలో జమచేస్తుంటారు. అయితే ప్రస్తుతం నాణేలు తీసుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని సమాచారం. అందుకు ప్రధాన కారణం.. సాయినాథుడి ఖాతాలున్న బ్యాంకుల వద్ద ఇప్పటికే దాదాపు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల నాణేలు నిల్వ ఉన్నాయట. స్ట్రాంగ్ రూమ్‌లు నాణేలతో నిండిపోయాయట. దీంతో బ్యాంకుల్లో నాణేలను నిల్వ చేయడానికి స్థలం కొరత ఏర్పడింది. దీంతో వారు మున్ముందు తీసుకోవడానికి అంగీకరించడం లేదు.
ఈ విషయంపై ఆలయ ట్రస్ట్ సీఈఓ మాట్లాడుతూ..’ట్రస్ట్ ఖాతాలున్న బ్యాంకులు నాణేలతో నిండిపోవడంతో వారు నిరాకరించారని తెలిపారు. ఆలయానికి సంబంధించి నాణాల రూపంలోనే ఎక్కువగా విరాళాలు వస్తున్నందున ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐని జోక్యం చేసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే అహ్మద్‌నగర్ జిల్లాలోని కొన్ని బ్యాంకుల్ని సంప్రదించి.. వారు నాణేలు తీసుకునేందుకు అంగీకరిస్తే అక్కడ కూడా ట్రస్ట్ ఖాతాలు తెరవాలని అనుకుంటున్నట్లు తెలిపారు’. కాగా, సాయినాధుడికి సంబంధించిన డిపాజిట్లు దాదాపు రూ.2,600 కోట్ల మేర బ్యాంకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సాయినాథుడి చిల్లర కష్టాలు ఎలా తీరతాయో! ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Out of space, banks refuse to accept coins from Shirdi temple https://t.co/9kXMFHKRMv
— TOI India (@TOIIndiaNews) April 20, 2023