భారత జవాన్లపై బంగ్లాదేశ్ వాసులు దాడి చేశారు. అక్రమంగా సరిహద్దులోకి ప్రవేశించడమే కాకుండా అడ్డుకున్నందుకు మన జవాన్లపైనే చేయి చేసుకున్నారు.
భారత జవాన్లపై బంగ్లాదేశ్ వాసులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా బెర్హంపూర్ సెక్టార్ లో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ కీలక ప్రకటనలో తెలిపింది. బెర్హంపూర్ సెక్టార్ పరిధిలో ఉన్న నిర్మల్ చర్ బోర్డర్ అవుట్ పోస్ట్ ప్రాంతంలో 35 మందితో కూడిన బెటాలియన్ గస్తీ కాస్తున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన రైతులు భారతీయ రైతుల పొలాల్లోకి చొరబడి.. వారి పశువులను తమ పొలాల్లో మేత మేయిస్తున్నారని.. తమ పంటలను దెబ్బ తీస్తున్నారని ఫిర్యాదులు చేశారు. దీంతో సరిహద్దు దగ్గర ఒక తాత్కాలిక అవుట్ పోస్ట్ ని జవాన్లు సెట్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారతీయ రైతులకు భద్రత ఇచ్చే ఉద్దేశంతో మన జవాన్లు కాపలా కాస్తున్నారు.
అయితే బంగ్లాదేశీ రైతులు తమ పశువులతో మన రైతుల పొలాల మీదుగా వస్తున్నారు. ఆ సమయంలో జవాన్లు వారిని ఆపినందుకు బంగ్లాదేశీయులు జవాన్లపై దాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే బాంగ్లాదేశ్ కి చెందిన వందలాదికి పైగా బంగ్లాదేశ్ గ్రామస్తులు వచ్చి జవాన్లపై దాడికి దిగారు. పదునైన ఆయుధాలు, కర్రలతో జవాన్లపై దాడికి దిగారని, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ తెలిపింది. దాడి తర్వాత జవాన్ల దగ్గరున్న ఆయుధాలను లాక్కెళ్లిపోయినట్లు బీఎస్ఎఫ్ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కి ఈ విషయం గురించి బీఎస్ఎఫ్ సమాచారాన్ని అందించింది. ఈ ఘటనపై ఫ్లాగ్ మీటింగ్ జరగాలని, మా జవాన్ల నుంచి పట్టుకెళ్లిన ఆయుధాలను తిరిగి తిరిగి ఇవ్వాలని కోరింది.
BSF jawans attacked by Bangladeshi miscreants and villagers, while performing duty in the security of Indian farmers on the international border of Murshidabad. 2 jawans seriously injured#BSF #Bangladesh pic.twitter.com/vHLOgaa0PE
— Gems of मजहब (@Gemsof1) February 27, 2023
రిపీటెడ్ గా బంగ్లాదేశీయులు తమ దేశంలోకి వస్తున్నారని , తమ రైతుల పొలాలను నాశనం చేస్తున్నారని.. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే సమావేశం జరగాలని బీఎస్ఎఫ్ పేర్కొంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. భారతీయ రైతుల పొలాల్లోకి బంగ్లాదేశ్ కి చెందిన రైతులు తమ పశువులను తోలుకొచ్చేవారని తెలిపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి జవాన్లపై దాడికి పాల్పడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది బీఎస్ఎఫ్. నేరపూరిత ఉద్దేశం ఉన్న స్మగ్లర్లు, ప్రజలు సరిహద్దు దాటి అక్రమ చర్యలు చేయాలని భావించి వచ్చారని అన్నారు.
అయితే ఆ చర్యలు ఫలించని కారణంగా జవాన్లపై దాడికి పాల్పడ్డారని దక్షిణ బెంగాల్ సరిహద్దు దగ్గర నుంచి స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. ఒక ప్రణాళిక పద్ధతిలో చొరబడి జవాన్లపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. అయితే ఇప్పటికీ జవాన్లు వారి ప్రణాళికలను సక్సెస్ కానివ్వలేదని ఆర్మీ తెలిపింది. నిర్మల్ చర్ ప్రదేశం చాలా ప్రమాదకరమైనది. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఈ ప్రాంతంలో జవాన్లు పగలూ, రాత్రి గస్తీ కాస్తున్నారు. మరి మన దేశ సరిహద్దులోకి వచ్చి మన రైతుల పొలాలను నాశనం చేయడమే కాకుండా అడ్డుకున్నందుకు జవాన్లపై దాడి చేసిన బంగ్లాదేశీయులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
BSF jawans suffer serious injuries after being attacked by Bangladeshi miscreants and villagers while on duty protecting Indian farmers on the international border.
.
.#bangladesh #india #border #security #attack #hindustanherald #heraldnews #heraldbreakingnews #heraldnews🗞️ pic.twitter.com/qEZGho3Iai— Hindustan Herald (@hindustanherald) February 27, 2023