భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త.. బజాజ్ గ్రూప్ గౌరవ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) కన్నుమూశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగాపేరొందిన రాహుల్ శనివారం తుది శ్వాస విడిచారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు రాహుల్ బజాజ్. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 1938 జూన్ 10 న మార్వారీ కుటుంబంలో జన్మించారు రాహుల్ బజాజ్. జమ్నాలాల్ బజాజ్ ప్రారంభించిన బిజినెస్ హౌస్ నుండి “బజాజ్” వచ్చింది. 2001 లో అతనికి భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.
ఇది చదవండి: ఉత్తరాఖండ్లో భూకంపం… భయంతో జనం పరుగులు!
2008 లో అతను బజాజ్ ఆటోను మూడు యూనిట్లుగా విభజించాడు – బజాజ్ ఆటో, ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్, హోల్డింగ్ కంపెనీ. రాహూల్ బజాజ్ 2006-2010 కాలంలో పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికయ్యారు. ప్రపంచ బిలియనీర్ల ఫోర్బ్స్ 2016 జాబితాలో అతను 2.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 722 వ స్థానంలో ఉన్నాడు. అతని కుమారులు ఇప్పుడు సంస్థ రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఆయన మరణం పట్ల పలువురు వ్యాపార, రాజకీయ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.