రాముడు పుట్టింది అయోధ్యలోనే. ఎన్నో శతాబ్దాలుగా పలు తరాలకు చెందిన వారు రామాలయం నిర్మాణం కోసం నిస్వార్ధ త్యాగాలు చేశారు. రామాలయ నిర్మాణం కోసం సాగిన త్యాగాలు, అంకిత భావం, సంకల్పం కారణంగానే ఇది సాకారం అయింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం 2025 చివరికల్లా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబర్ నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులకు ప్రవేశం కల్పిస్తారని అయోధ్య రామాలయ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో కొత్త రకపు డిజిటల్ మ్యూజియం, డిజిటల్ ఆర్చీవ్స్, భక్తులు ఉండడానికి ప్రదేశం, మంచి ఆడిటోరియం లు మరియు పాలనా భవనాలు, పూజారులకు ప్రత్యేక గృహ సముదాయాలు నెలకొల్పుతున్నారు. ఇందులో మొదటి అంతస్థులో మూడు అంతస్తులు మరియు రామ్ దర్బార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు సుమారుగా 1000 కోట్లు కానున్నట్లు సమాచారం.
సేకరించిన విరాళాలు 3000 కోట్లు ఉన్నాయట. సరిగ్గా ఈ రోజుకి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టి సంవత్సరం అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. అంటే ఆలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం భక్తులు 2023 డిసెంబర్ నుంచి అయోధ్యలో పూజలు చేయవచ్చన్నమాట.