ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు అడిగినా అడగక పోయినా సాయంగా ఏదైనా ఇవ్వడాన్ని దానం అంటారు. వస్తు, డబ్బు, భూమి, ఆహార పదార్ధాలు సహా అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి.. ఆకలి తీర్చిన ఆ వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. నేటికాలంలో ఇలా దానధర్మాలు చేసే వాళ్లు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో ముంబైకి చెందిన ఆటోవాలా ఒకరు.
ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు అడిగినా అడగక పోయినా సాయంగా ఏదైనా ఇవ్వడాన్ని దానం అంటారు. వస్తు, డబ్బు, భూమి, ఆహార పదార్ధాలు సహా అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి.. ఆకలి తీర్చిన ఆ వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. అయితే నేటికాలంలో ఇలా దాన ధర్మాలు చేసే వాళ్లు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. అయితే దానం చేసే గుణానికి ధనిక పేదరికం అనే తేడా ఉండదు. మంచి మనస్సు మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తే.. ముంబైకి చెందిన ఓ ఆటోవాల. తన వాహనంలో ప్రయాణించే వారి వాటర్ బాటిల్స్ ఉచితంగా ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేటికాలంలో చాలా మందికి తమ వద్ద డబ్బులు ఉన్న కూడా దానం చేసే గుణం ఉండటం లేదు. ఇంకా సంపాదించాలనే కోరిక తప్ప.. నలుగురికి సాయం చేద్దామనే ఆలోచన కనుమరుగవుతుంది. అయితే కొందరు మాత్రం తమకు ఉన్నంతలో కొంత పరులకు సాయం చేయాలనే మంచి ఆలోచనతో ఉన్నారు. అందుకే తాము సంపాదించిన సొమ్ములో నుంచి కొంత తీసి..పేదలకు, ఇతర అనాథలకు సాయం చేస్తుంటారు.
తాజాగా ఓ ముంబైకి చెందిన ఓ ఆటోవాల అలాంటి పనే చేశాడు. తన వాహనంలో వాటర్ బాటిల్స్‌ను ఉంచి ప్రయాణీకులకు ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఆటోవాలా గొప్ప మనసును చాటే పోస్ట్‌ను నందినీ అయ్యర్ అనే నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. “ముంబై ఆటోవాలా ఉచితంగా మంచి నీరు అందిస్తున్నాడు. ఇది చూడటానికి ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది. అలానే మానవత్వం పరిమళిస్తుంది” అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఆ వ్యక్తి మంచి మనస్సును చాటే ఈ ఉదంతం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఆటో లోపల ప్రయాణీకుల కోసం కొన్ని వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. వీటిని ఆ ఆటోవాలా ప్రయాణీకులకు ఉచితంగా ఇస్తున్నాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని క్షణాల్లో ఫుల్ వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ పోస్ట్ ను పెద్ద సంఖ్యలో వీక్షించిన నెటిజన్లు రియాక్టయ్యారు. ఆటో డ్రైవర్ మంచి మనస్సు తెలిసిన కొందరు నెటిజ్లు ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. ఈ ఆటోవాలాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gesture Matters ☺️
Mumbai autowala giving free water . It’s immensely satisfying to see. #SpreadKindness ✌🏼 pic.twitter.com/M2nVrLPJQg— NANDINI IYER (@123_nandini) April 3, 2023