ఒక మనిషి ప్రాణం కళ్లేదుట పోతుంటేనే ప్రాణం అల్లాడుతుంది. అలాంటిది అసలే అనారోగ్యంతో మంచాన పడ్డ రోగిని చంపడం అంటే ఎంతటి దారుణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వ్యక్తి.. అనారోగ్యంతో ఉన్న 300 మంది రోగులను దారుణంగా చంపేశాడు. అతడే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక మనిషి ప్రాణం కళ్లేదుట పోతుంటేనే ప్రాణం అల్లాడుతుంది. అలాంటిది అసలే అనారోగ్యంతో మంచాన పడ్డ రోగిని చంపడం అంటే ఎంతటి దారుణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ వ్యక్తి చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు సదరు వ్యక్తి అన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో తమిళనాట సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పుల్ వైరల్ గా మారింది. అంతేకాక ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్(34) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోజూ తిరుగుతుండే వాడు. మార్చూరి వద్ద పనిచేసే వ్యక్తితో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీన సోషల్ మీడియాలో అతడు 300 హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆ వీడియోలో అతడు మాట్లాడిన ప్రకారం.. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు విషపు ఇంజెక్షన్ వేసి హత్తయ చేసేవాడినని అన్నాడు. ఇలా చేసినందుకు వారి నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇలా దాదాపు 300 లకు పైగా హత్యలు ఈ పదేళ్లలో చేసినట్లు మోహన్ రాజ్ పేర్కొన్నాడు. ఈ తరహా పనులు చేసేందుకు చెన్నై, బెంగళూరుకు వెళ్లి మరి చేసేవాడినని అతడు తెలిపాడు.
రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తానని అతడు పేర్కొన్నాడు. అతడు మాట్లాడిన వీడియో వైరల్ గా మారి… చివరకు పోలీసులకు చేరింది. దీంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి.. మోహన్ రాజ్ ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో అలా మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తెలింది. ఇప్పటి వరకు 18 మంది నకిలీ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.