సాధారణంగా సిటీల్లో ఎక్కువ శాతం ఏటీఎంలు దర్శనమిస్తుంటాయి. ఈ మద్య డిజిటలైజేషన్, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లేవాళ్లు చాలా తక్కువైపోయారు. కొన్నిసార్లు ఏటీఎం లో సాంకేతిక లోపం.. సిబ్బంది తప్పిదాల వల్ల మనం ఎంటర్ చేసిన డబ్బుకన్నా ఎక్కువ విత్ డ్రా అవుతుంటాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు.
ఏటీఎం లో మనీ డ్రా చెద్దామని ఒక యువకుడు వెళ్లాడు. ఏటీఎం మెషన్ లో కార్డు పెట్టి తనకు కావాల్సిన రూ.500 ఎంటర్ చేశాడు. ఏటీఎం నుంచి ఒక్కసారే ఐదు ఐదువందల నోట్లు వచ్చాయి. మొదట షాక్ తిన్న ఆ యువకుడు మరోసారి అలాగే ప్రయత్నించాడు.. అప్పుడు కూడా అలాగే వచ్చాయి. సదరు ఏటీఎం లో ఐదు వందలకు ఎంటర్ చేస్తూ ఐదు రెట్లు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం జనాలకు తెలియడంతో ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే..
అక్కడ జరుగుతున్న తతంగం గురించి దగ్గరలోని పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఏటీఎం సెంటర్ ను మూసేశారు. ఏటీఎం లో జరుగుతున్న విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. ఏటీఎం ట్రేలో మనీ పెట్టే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఇలా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.