ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం చేయరాని తప్పులు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బు వస్తే చాలు అన్న కోణంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా గురించి విన్నాం. తాజాగా కుక్కల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. జోర్ హట్ జిల్లాలో ముగ్గురు సభ్యుల ముఠా వీధి కుక్కలను ఎత్తుకెళ్లి.. అక్రమంగా నాగాలాండ్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా నుంచి 24 కుక్కలను రెస్క్యూ చేశారు. నాగాలాండ్ లో ఈ ఏడాది జులై నుంచి కుక్క మాంసంపై నిషేధం విధించారు. కుక్కల మాంసాన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాగ్ మీట్ పై నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. కుక్కల దిగుమతి, కుక్కల మార్కెట్లు, వీటి మాంసంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. నాగాలాండ్‌లో ఓ వర్గం ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
కుక్కల్ని తినడమనేది తరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తోందనీ… తమ ఆచారాల్ని మంట కలిపే కుట్ర జరుగుతోందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగాలాండ్ లో ఈ ఏడాది జులై నుంచి కుక్క మాంసంపై నిషేధం విధించినప్పటి నుంచి అక్రమరవాణా పెరిగిందన్నారు. న్యూ ఇయర్, క్రిస్టమస్ నేపథ్యంలో కుక్క మాంసానికి డిమాండ్ పెరగడంతో.. వీధి కుక్కలను ఎత్తుకెళ్తున్నారని స్థానిక ఎన్జీవోలు చెబుతున్నారు.
Assam | Police rescued 24 local dogs in Jorhat from being illegally smuggled to Nagaland. The dogs were tied with ropes and sacks. One person was arrested: Mamoni Hazarika, DSP, Jorhat (16.12) pic.twitter.com/gqd7WWaSuh
— ANI (@ANI) December 17, 2021