కోట్లు విలువ చేసే కారు కొనాలని.. అందులో చక్కర్లు కొట్టాలని అందరికీ ఉంటుంది. కానీ, దాన్ని సాకారం చేసుకొనే వారు మాత్రం కొందరే ఉంటారు. అందులోనూ.. ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యాధునిక టెక్నాలజీ, అధునాతన ఫీచర్లకు ఈ కారు పెట్టింది పేరు. రూ. కోట్ల ధర పలికే ఈ కారును సొంతం చేసుకోవడం సామాన్య ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే.. ఆ కలను నెరవేర్చుకోవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చం అలానే.. ఓ మెకానిక్ తన తెలివితేటలతో లంబోర్గినీ కారును సృష్టించాడు. దాన్ని ముఖ్యమంత్రిగా బహుమతి అందించాడు.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ‘లంబోర్గినీ’ లాంటి కారు గిఫ్ట్ గా లభించింది. ఈ విషయాన్నిఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ కారును ఆయనకు ఒక బడా పారిశ్రామికవేత్తనో లేదా ప్రత్యేక వ్యక్తి ఇవ్వలేదు. అస్సాం రాష్ట్రం, కరీంగంజ్‌కు చెందిన నూరుల్ హక్ అనే మెకానిక్ ఈ కారును బహుకరించారు. నూరుల్ హక్ (31)కు కార్లను రకరకాలుగా డిజైన్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే రూ. 10 లక్షల ఖర్చుతో మారుతి స్విఫ్ట్ కారును కొనుగోలు చేసి.. దానిని లంబోర్గినీగా మాడిఫై చేశాడు. మాడిఫై చేసినంత మాత్రాన స్విఫ్ట్ కారు.. లంబోర్గినీ కారు అవుతుందా! అనుకోవచ్చు. అందుకు అతడు పడ్డ కష్టం, దానిని బహుకరించాలని నిర్ణయం తీసుకోవడం అంతకంటే విలువ చేసేదే.
Assam | I have modified a Maruti Swift into a model of Lamborghini for Assam CM Himanta Biswa Sarma. This took me 4 months to modify this. I always wanted to work on modifying cars, I have earlier worked in a garage for around 18 years: Nurul Haque, Car Mechanic
(02.12) pic.twitter.com/sKXkBZxDpj— ANI (@ANI) December 3, 2022
నూరుల్ హక్ మాట్లాడుతూ.. “కొంతకాలం కిందట నేను నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో మెకానిక్‌గా పనిచేశాను. అప్పటినుంచే ఇలాంటి పయత్నాలు చేయడం మొదలుపెట్టాను. గతేడాది కూడా ఒక కారును ఇలాగే మాడిఫై చేశాను. ‘లంబోర్ఘిని’ వంటి సూపర్‌కార్‌ను నడపాలని నేను ఎప్పటినుంచో కోరుకునేవాడిని. దీని కోసం పది లక్షల రూపాయలు ఖర్చుచేశా. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బహుమతిగా ఇవ్వడం కోసమే ఈసారి లంబోర్గినీగా మార్చాను.. ” అని చెప్పుకొచ్చాడు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు. నూరుల్ హక్ తయారు చేసిన ‘లంబోర్గినీ’ కారుని చూసి చాలా థ్రిల్ ఆయ్యానని రాసుకొచ్చారు. అలాగే నూరుల్ ఫ్యూచర్ కి అల్ ది బెస్ట్ కూడా తెలిపారు. కాచార్ జిల్లాలోని పరిపాలన ప్రధాన కార్యాలయన్ని ముఖ్యమంత్రి సందర్శించిన సమయంలో ఈ లంబోర్గినీ కారును బహుమతిగా అందించారు. ఇదిలా ఉంటే నూరుల్ ప్రస్తుతం పాత కారును ఫెరారీగా మాడిఫై చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
Wrapped up my day at Silchar with a walk from Itkhola to Circuit House along with our karyakartas. Happy to meet a lot of warm-hearted along the way.
Also had the thrill of being at the wheel of a ‘Lamborghini’ assembled by Nurul Haque, a car enthusiast from Karimganj. pic.twitter.com/7EMsG4MtbT
— Himanta Biswa Sarma (@himantabiswa) November 29, 2022