సాధారణంగా కొన్ని విషయాలు గురించి విన్నా.. కొన్ని సంఘటనలను చూసినా ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఎవరికైనా నిద్రవస్తే ఏం చేస్తారు? పనికి వెళ్లిన కూలీలు పని ప్రదేశంలో.. ప్రయాణం చేసేవారు ప్రయాణంలో.. మిగిలినవారంతా ఇళ్లలో కునుకు తీస్తుంటారు. అయితే.. ఓ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాక నిద్రవస్తే ఎక్కడ పడుకుంటారు? అంటే.. వెయిటింగ్ హాల్ లోనో, కాదు అంతవరకూ వెళ్ళలేను అనిపిస్తే ప్లాట్ ఫామ్ పైనే నిద్రపోవడం గురించి మనం వింటుంటాం. కానీ ఇటీవల ఓ మహిళ చేసిన పనికి రైల్వే స్టేషన్ లో ఉన్న జనమంతా టెన్షన్ కి గురయ్యారు.
ఇంతకీ ఆ మహిళ చేసిన పనేంటంటే.. పట్టాలపై నిద్రపోవడం. అవును నిత్యం రైళ్లు ప్రయాణించే పట్టాలపై మహిళ నిద్రపోవడమే గాక సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రోజున ఔరంగాబాద్ లోని చికల్తానా రైల్వే ట్రాక్ పై నిద్రపోతున్న ఓ మహిళపై నుండి జనశతాబ్ది ఎక్సప్రెస్ రైలు దూసుకెళ్లింది. చికాల్తానా వెళ్తున్న రైలు ముకుంద్ వాడి రైల్వే స్టేషన్ కు వేగంగా పట్టాలపై దూసుకొస్తోంది. ఈ క్రమంలో దూరంగా ఓ మహిళ ట్రాక్ పై పడుకొని ఉండటం గమినించారు.
వెంటనే హారన్ కొట్టగా ఆ మహిళ లేవకపోవడంతో.. చాకచక్యంగా రైలుకు బ్రేకులు వేశారు డ్రైవర్లు అమిత్ సింగ్, ధీరజ్ థోరట్. వేగంగా రావడంతో బ్రేకులు వేసినప్పటికీ.. మహిళపై నుండి మూడు బోగీలు దాటివెళ్లాయి. ఇక రైల్లో ఉన్న ప్రయాణికులు కిందకు దూకి వెంటనే అరుపులు, కేకలతో సదరు మహిళను నిద్రలేపి బయటకు లాగారు. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు అసలు మహిళ అక్కడెలా నిద్రపోయింది? పైనుండి రైలు వెళ్ళాక నిద్రలేవడం ఏంటని షాక్ అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
औरंगाबादमधील व्हायरल व्हिडिओ; लोको पायलटच्या सतर्कतेमुळे महिला बचावली; पाहा नेमके काय घडले #Aurangabad #ViralVideo #indianrailway @RailMinIndia pic.twitter.com/5fTNUZbAGO
— SakalMedia (@SakalMediaNews) May 30, 2022