డబ్బు కోసం ఈ మద్య మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచించే ఈ కాలంలో కొంత మంది మాత్రం దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి దాన ధర్మాలు చేస్తూ పదిమందిలో షెభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా దేవాలయాల వద్ద ఎంతో మంది యాచకులను చూస్తుంటాం. వారి దీనమైన పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ జాలేస్తుంది.. తమకు తోచినంత దానం చేస్తూ ఉంటారు. ఈ మద్య కొంత మంది యాచకులు దేవాలయాలకు విరాళం ఇస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఓ యాచకురాలు గొప్ప మనసు చాటుకుంది. గుడిలో అన్నదానం కోసం లక్ష రూపాయలు విరాళం ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని మంగళూరులో అశ్వత్థమ్మ యాచకురాలిగా జీవనం సాగిస్తుంది. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె పలు దేవాలయాల వద్ద బిక్షాటన చేస్తూ తన వరకు కొంత దాచుకొని మిగిలిన సొంమ్మ కూడబెట్టి పలు ఆలయాలకు విరాళంగా ఇస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం ఆమె భర్త, పిల్లలు మృతి చెందడంతో యాచకురాలిగా మారింది. సాలిగ్రామలో ఆమె మొదటిసారిగా బిక్షాట చేయడం ప్రారంభించింది. బిక్షాటన చేసి గుడి ఆవరణలోనే నివసిస్తూ వస్తుంది. ఇలా ఆమె పద్దెనిమిది సంవత్సరాల పాటు యాచకురాలిగా జీవనాన్ని కొనసాగిస్తుంది.
ఈ క్రమంలో అశ్వత్థమ్మ మంగళూరులో బప్పనాడు శ్రీ దుర్గాపరమేశ్వరి దేవాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమం కోసం లక్ష రూపాయల విరాళం అధికారులకు అందజేశారు. విరాళం స్వీకరించిన తర్వాత అశ్వత్థమ్మకు దేవాలయ అర్చకులు, సిబ్బంది ప్రసాదం అందజేసి ఆమెను సన్మానించారు. ఇప్పటి వరకు అశ్వత్థమ్మ పలు దేవాలయాలకు తొమ్మిది లక్షల విరాళాలు అందించినట్లు తెలుస్తుంది. దేవుడిపై భక్తి.. పది మందికి సేవచేయాలనే ఆమె సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇది చదవండి: లక్కున్నోడు! డ్రాకు ఒక్కరోజు ముందు కొన్న లాటరీ టికెట్! లాటరీలో ఏకంగా..