ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అర్హులు అయిన ప్రతీ ఒక్క యువకుని కల. అయితే అలాంటి వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ ఆర్మీ.
దేశం కోసం పోరాడాలని, అందుకోసం ఆర్మీలో చేరడానికి ఉవ్విళ్లూరుతుంటారు యువత. దాని కోసం ఎంతటి కష్టానికైనా సిద్దపడుతుంటారు. అయితే అలాంటి యువతకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ ఆర్మీ. ఈ వార్త ఆర్మీలో చేరడానికి సిద్దం అవుతున్న యువకులపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. గతంలో
ఏడాదికి రెండు సార్లు ఆర్మీ రిక్రూమెంట్ ర్యాలీలు జరిగేవి. దాంతో ఔత్సాహిక యువకులు వేలల్లో ఆ ర్యాలీలకు హాజరైయ్యేవారు. అయితే ఇక నుంచి అలా రెండు సార్లు ఆర్మీ ర్యాలీల్లో పాల్గొనే అవకాశం లేదంటున్నారు ఆర్మీ అధికారులు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అర్హులు అయిన ప్రతీ ఒక్క యువకుని కల. అయితే గతంలోలా వయసు పూర్తి అయ్యే వరకు ఉద్యోగం కోసం పోటీపడే అవకాశం లేదంటున్నారు ఆర్మీ అధికారులు. వివరాల్లోకి వెళితే.. గతంలో సంవత్సరంలో ఎన్నిసార్లు ఆర్మీ రిక్రూమెంట్స్ జరిగితే అన్ని సార్లు అభ్యర్థులు అప్లై చేసుకునే వాళ్లు. ఇక నుంచి ఆ అవకాశం లేదని తెలిపాడు బ్రిగేడియర్ జగదీప్ చౌహాన్. మార్చిన నిబంధనల ప్రకారం ఇక నుంచి అర్హులు అయిన అభ్యర్థులు సంవత్సరానికి ఒకే ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవాలని బ్రిగేడియర్ జగదీప్ చౌహాన్ పేర్కొన్నారు.
అయితే మీరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగా.. CEE ర్యాలీ ద్వారా ఆర్మీలో ఉద్యోగం పొందాలి అంటే ఒక్కసారి కంటే ఎక్కువగా అప్లై చేసుకోలేరు. అనంతరం ఈ సంవత్సరం జరగనున్న ఆర్మీ అగ్నివీర్ రిక్రూమెంట్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం అగ్నివీర్ పథకం ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 15 2023 వరకు ఈ ర్యాలీకి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక అగ్నివీర్ ప్రక్రియను రెండు దశల్లో చేపట్టనున్నట్లు బ్రిగేడియర్ చౌహన్ తెలిపారు. అయితే ఎంతో ఉత్సాహంగా ఆర్మీలో జాబ్ కొట్టాలనుకునే యువకులకు మాత్రం ఇది చేదువార్త అనే చెప్పాలి. మరి ఇండియన్ ఆర్మీ సడలించిన నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.