ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగాలు దొరకడమేకష్టం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రైల్వే, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాలపై యువతకు ఆసక్తి ఉంటుంది. అయితే వీటిల్లో ఉద్యోగాలు పడటమే కష్టం. వీటికి పోటీ కూడా ఎక్కువే. అయితే ఓ సదవాకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ). ఇంట్లోనే ఉంటూ సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తోంది.
ఇటీవల ప్రైవేటు ఉద్యోగస్థుల్లో వైరాగ్యం ఎక్కువ కనిపిస్తోంది. ఉదయం ఎప్పుడో పది గంటలకు ఆఫీసుకు వెళ్లి.. రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకునే ఉద్యోగాలపై ఆసక్తిని కోల్పోతున్నారు. చాలీ చాలనీ జీతంతో ఉద్యోగంపై విరక్తి చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామంటే తక్కువ ఉద్యోగాలు, ఎక్కువ పోటీ నెలకొంటుంది. ఇక రైల్వే ఉద్యోగాల వైపు చూడలేని పరిస్థితి. అయితే కొంత ఆశ తీరే అవకాశాలను కల్పిస్తోంది రైల్వే శాఖ. అంతేకాదూ సంపాందించుకునే అవకాశాన్ని అందిస్తోంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లో ఉంటూ ఆర్జించవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో జత కలిసి సంపాదించుకోవచ్చు. ఇంతకూ అదెలా అనుకుంటున్నారా..? అయితే ఈ వివరాలు మీ కోసమే..
ఇంతకు ఏం పని చేయాలంటే..? మీరు ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారడమే. ఇంట్లో ఉంటూనే సంపాదించుకోవచ్చు. ఈ పనిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. ఇంట్లో కంప్యూటర్ సాయంతో పని చేస్తూ ఆర్జించవచ్చు. అలాగే రైల్వేలో టికెట్ గుమాస్తాలు ఏ పని అయితే చేస్తారో? ఏజెంట్ కూడా ఇంటి వద్ద నుంచి అదే పని చేయాలి. ఏజెంట్ బుక్ చేసిన టికెట్లకు రైల్వే శాఖ కమిషన్ ఇస్తుంది. రైల్వే కౌంటర్లలో గుమాస్తాలు టిక్కెట్లు అందించినట్లు, ఈ ఏజెంట్లు కూడా ప్రయాణీకులకు టిక్కెట్లు బుక్ చేయాలి. ఇందులో టికెట్ కటింగ్ కోసం ఏజెంట్‌కి కమీషన్ వస్తుంది. దీని ద్వారా ఏజెంట్లు ఇ-టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నందుకు ఒక్కో టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్‌ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్‌కు కమీషన్‌గా లభిస్తుంది. అలాగే టికెట్ ధరలో ఒక శాతం కూడా ఏజెంట్‌కు ఇస్తారు.
టికెట్లు తీసేందుకు పరిమితి ఉందని భావిస్తున్నారా..? ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారడం వల్ల పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేయోచ్చు. ఒక సంవత్సరానికి ఏజెంట్‌గా మారాలనుకుంటే, ఐఆర్‌సీటీసీ రుసుము కింద రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది, అయితే రెండు సంవత్సరాలకు ఈ ఛార్జీ రూ. 6,999 చెల్లించాలి. ఏజెంట్‌గా నెలలో 100 టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఏజెంట్‌గా మీరు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లతో పాటు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఏజెంట్ బుక్ చేసే టిక్కెట్ల ఆధారంగా వారి సంపాదన ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఒక నెలలో బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్యపై నెలలో మంచి బుకింగ్ లభిస్తే, అప్పుడు ఏజెంట్ నెలకు రూ. 80,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు. టికెట్ల బుకింగ్ తక్కువన్నా సగటున రూ.40 వేల నుంచి రూ.50 వేలు వచ్చే అవకాశం ఉంది.