ప్రస్తుతానికి ఫ్రీ ఛానెల్స్/పే చానెల్స్ ఏవి చూడాలన్నా సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్ల కోసం కూడా వినియోగదారులు సెట్ టాప్ బాక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే.. రాబోవు రోజుల్లో సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం టీవీ చూడాలంటే తప్పనిసరిగా సెట్ టాప్ బాక్స్ ఉండి తీరాల్సిందే. 300 రూపాయలు వెచ్చిస్తే కానీ, కుటుంబమంతా కలిసి టీవీ చూడలేం.. అదే స్పోర్ట్స్ చానెల్స్ కావాలంటే మరో 100 రూపాయలు అదనంగా వెచ్చించాలి. పోనీ ఫ్రీ చానెల్స్ చూస్తూ సమయం గడుపుదామన్నా సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. అయితే.. రాబోవు రోజుల్లో సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన చేశారు. అందుకోసం టెలివిజన్ సెట్‌లలో ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అది సాధ్యమైతే ప్రత్యేక సెటప్ బాక్స్ ల అవసరం ఉండకపోవడంతో పాటు 200కి పైగా చానెల్స్ ను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెట్ టాప్ బాక్స్ ల ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తోంది. అందుకోసం టెలివిజన్ సెట్‌లలో ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయనుంది. ఇది సాధ్యమైతే.. టెలివిజన్ సెట్లతో పాటు ఓ యాంటెన్నా వస్తుంది. దీనిని ఇంటి పైకప్పు, లేదా గోడల మీద, లేదా అనుకూలంగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్, రేడియో ఛానెల్స్ ప్రసారాలను పొందే అవకాశం కలుగుతుంది. కాగా, బిల్ట్ ఇన్ శాటిలైట్ ట్యూనర్ల ఏర్పాటుపై బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ జారీ చేసిన ప్రమాణాలను పాటించేలా టెలివిజన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అనురాగ్ ఠాకూర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి ఫ్రీ ఛానెల్స్/పే చానెల్స్ ఏవి చూడాలన్నా సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్ల కోసం కూడా వినియోగదారులు సెట్ టాప్ బాక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. KPMG నివేదిక ప్రకారం.. 2015లో ఫ్రీ డిష్ వినియోగదారులను 20 మిలియన్లుగా ఉండగా.. 2021 వరకు ఆ సంఖ్య 43 మిలియన్లకు పెరిగింది. అలాగే.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి విద్య అందుబాటులో ఉండేలా చూడడానికి ప్రధాని మోదీ ఆదేశాలతో 1 నుంచి 12 తరగతులకు ప్రత్యేక చానెళ్లు ఏర్పాటు చేసినట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యకు సంబంధించి 55 చానెళ్లు ఉన్నట్లు వివరించారు.
Set-top boxes may soon be a thing of the past. Information and Broadcasting Minister #AnuragThakur said that efforts were afoot to have a built-in satellite tuner in television sets so that users can have access to over 200 channels. | @Madhusree24 https://t.co/tBJ82ZHvZZ
— The Quint (@TheQuint) February 15, 2023