ఒడిషా రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపాలతో ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇండియన్ రైల్వేపై విమర్షలు వెల్లతువెత్తుతున్నాయి.
భారతీయ రైల్వేలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఇండియన్ రైల్వే నిర్వహణలోపంతో విమర్షలను ఎదుర్కొంటుంది. జరుగుతున్న ప్రమాదాలకు మానవ తప్పిదాలో లేక టెక్నికల్ సమస్యలు కారణంగానో రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైల్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయానికి గురిచేస్తున్నాయి. రైలు ప్రయాణమంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ లో ఓండా రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నలింగ్ నిర్వహణలో తలెత్తిన లోపంతో లూప్ లైన్లోకి వెళ్లిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో 12 కు పైగా బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు లోకో పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఘటనతో ఆగ్నేయ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ పునరుద్దరణ పనులను చేపట్టారు. గూడ్స్ రైళ్లు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కలుగలేదు ఒకవేళ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొని ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని పలువురు అంటున్నారు.