రాజధాని నగరం హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ కేసులో పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పబ్‌కు వెళ్లిన యువతి (17)పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక సంచలనంగా మారిన ఈ అత్యాచారం కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితులను శిక్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇకపోతే ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూపు చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా.. హైదరాబాద్లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్త పై స్పందించారు. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను..’’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
I don’t know these boys but may I suggest that the headline is inappropriate? These boys are not from ‘influential’ families but from ‘poor’ families. Families that are ‘poor’ in culture, upbringing & human values. May justice be delivered. https://t.co/Z22kok8cp1
— anand mahindra (@anandmahindra) June 3, 2022
ఇది కూడా చదవండి: ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. సూపర్ ఫినిషింగ్ అంటూ ట్వీట్
వారం కిందట అమ్నేషియా పబ్ సమీపంలో మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు పలువురు నిందితులు. బాలికను పబ్‌కు తీసుకెళ్లిన ఆడి కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు మైనర్ బాలికపై కారులోనే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో కారులో పబ్ దగ్గర బాలికను వదిలివెళ్లారు.తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక ఆమె తండ్రికి వివరించింది. దీంతో బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె తండ్రి.. తన కూతురుపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పబ్, బేకరీతో పాటు పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Jubilee Hills: హైదరాబాద్ అమ్నీషియా పబ్ కేసు లో ఊహించని ట్విస్ట్ లు!
ఈ అత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మరోవైపు ఈ ఘటనలో తన ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి మహమూద్ అలీ మనవడు పుర్జాన్ స్పందించారు. తాను ఎవరికీ పబ్‌లో పార్టీ ఇవ్వలేదని అన్నారు. ఘటన జరిగిన రోజు తాను ముంబైలో ఉన్నానని తెలిపారు. అసలు ఘటనకు పాల్పడిన నిందితులు ఎవరో తనకు తెలియదని అన్నారు. ఆనంద్ మహీంద్రా స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Anand Mahindra: సర్కారు వారి పాట సినిమాపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!