అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీవ్ర ధన నష్టం, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఫైర్ యాక్సిడెంట్స్ చోటుచేసుకున్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం, నిర్వహణ లోపం, అజాగ్రత్తల వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్ని ఘటనల్లో మంటల్ని అదుపు చేయలేకపోతున్నారు. దీంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.
అద్భుతమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇలాంటి ప్రమాదాల్లో బాధితులను కాపాడటం కుదరట్లేదు. ఇదిలాఉంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనేది తెలిసిందే. తాజాగా ఆయన మరో కొత్త వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్ల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ వీడియోలో ఇన్‌ఫ్లేటబుల్ సేఫ్టీ బెలూన్ కనిపిస్తోంది. షోల్డర్ బ్యాగ్ మాదిరిగా ఉండే దీన్ని భుజానికి తగిలించుకుని.. గ్రిల్స్ లేని విండో లేదా మేడ మీద వెళ్లి పిట్ట గోడపై కూర్చోవాలి.
బ్యాక్ ప్యాక్ నుంచి బెలూన్ పెద్దదయ్యేలా స్విచ్ ఆన్ చేయాలి. దీంతో బెలూన్ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఆ తర్వాత కిందకు దూకేస్తే క్షేమంగా నేల మీద ల్యాండ్ అవ్వొచ్చు. ఈ వీడియోకు ఒక మంచి క్యాప్షన్ జత చేశారు ఆనంద్ మహీంద్రా. ‘ఇది నిజమేనని ఆశిస్తున్నా. ఏదో ఒక సంస్థ దీన్ని తయారు చేస్తూ ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ నేను గనుక ఎత్తయిన బిల్డింగ్‌లో ఉండాల్సి వస్తే దీన్ని పక్కాగా కొనుక్కుంటా. ఇది చాలా వినూత్నంగా ఉంది’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. ఫైర్ యాక్సిడెంట్ల నుంచి బయటపడేందుకు సాయపడే ఈ ఇన్నోవేటివ్ బెలూన్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I hope this is for real and some company is manufacturing it. If I lived in a high-rise, this would be a priority purchase! Very innovative. pic.twitter.com/BLkzMyWGtZ
— anand mahindra (@anandmahindra) February 5, 2023