ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ తెలివి తేటలకు పదను పెడుతూ ప్రతిభను నిరూపించుకునే వారి గురించి తెలిస్తే ఆనంద్ మహీంద్ర వెంటనే స్పందిస్తారు. అంతే కాకా తనకు నచ్చిన, తనను ఆకట్టుకున్న వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి వాటిపై సందర్భానికి తగ్గట్లు కామెంట్స్ జత చేస్తుంటారు. అవసరమైతే వారికి అండగా నిలబడుతుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర.. కేవలం కాళ్లతో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
“ఈ వ్యక్తి మన కార్లను నడపడం గౌరవంగాను, ప్రత్యేకంగాను ఉంది. విక్రమ్, నేను నీకు నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని మేము రైజ్ స్టోరీ అని పిలుస్తాము. కృతజ్ఞతతో జీవితాన్ని స్వీకరించడానికి మమ్మల్ని ప్రేరేపించిన మీకు ధన్యవాదాలు ” అంటూ ఆనంద్ మహీంద్ర వీడియో పోస్ట్ చేశారు. ఇన్స్పిరేషన్ వీడియోలను, పోస్ట్ లను చేసే చేస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్ అంటూ ఆనంద్ మహీంద్రాపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It would be an honour and a privilege to have this man drive our cars. Vikram, I bow low to you. You are what we call a Rise story. Thank you for inspiring us to embrace life with gratitude… pic.twitter.com/SyxncKOoob
— anand mahindra (@anandmahindra) May 21, 2022