వర్షాకాలంలో వర్షం పడినంత సేపు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ, వర్షం ఆగిన తర్వాత మాత్రం ఎక్కడ చూసినా బురద, చిత్తడి నేలతో కాస్త చిరాకుగానే ఉంటుంది. అదే నగరాల్లో అయితే నీళ్లన్నీ రోడ్లపైకి వచ్చేసి నడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. కొంతమంది అయితే మోకాళ్లలోతు నీళ్లలోనూ అలాగే తడుచుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం అలా అందరిలా తడవడానికి ఇష్ట పడలేదు.
మోకాళ్ల లోతు నీళ్లలోనూ అరికాలు కూడా తడవకుండా రోడ్డు దాటేశాడు. అందుకోసం తానే స్వయంగా ఒక ఉపయాన్ని కనుగొన్నాడు. రెండు ప్లాస్టిక్ చైర్లకు పై భాగంలో బలమైన దారాలను కట్టాడు. ఒక కుర్చీ పైన నిల్చొని రెండో కుర్చీని ముందుకు వేసుకున్నాడు. అలా అడుగులో అడుగు వేసుకుంటూ కాలు తడవకుండా రోడ్డు దాటేశాడు.
ఆ యువకుడి ఉపాయం మనలాంటి సామాన్యులనే కాదు.. ఏకంగా ఆనంద్ మహీంద్రాలాంటి దిగ్గజాలను సైతం అబ్బురపడేలా చేసింది. ఆ వీడియో స్వయంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. “అవసరమే అన్ని ఇన్వెన్షన్లకు మూలం” అంటే అవసరమే మనిషికి అన్నీ నేర్పుతుంది అనేలా ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఈ కుర్రాడి ఉపాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
👍🏽 As the saying goes: Necessity is the mother of invention… pic.twitter.com/VjyD2LzgAR
— anand mahindra (@anandmahindra) July 8, 2022