దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో సామన్య మానవుడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారు అయింది. ”మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు” ఇప్పటికే ఈ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త అందింది. తాజాగా పాల కంపెనీలు పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మధ్యతరగతి మానవుడి వంటింట్లో ఇప్పటికీ వస్తువుల ధరల మంట మండుతూనే ఉంది. తాజాగా ఆ మంటల్లో ఆజ్యం పోస్తూ పాల కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అమూల్.. దేశంలో పేరు పొందిన పాల కంపెనీ. దీని మతృ సంస్థ అయిన గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను పెంచింది. పాల ఉత్పత్తి వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గోల్డ్, తాజా, శక్తి మిల్క్ పై లీటర్ కు రూ.2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ పెంపు ఆగస్టు 17 నుంచే అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపింది. ఈ ధరలు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతీ చోట వర్తిస్తాయని స్పష్టం చేసింది.
మదర్ డెయిరీ.. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన సంస్థ. ఈ కంపెనీ కూడా ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతాల్లో లీటర్ కు రూ 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ధరలు ఆగస్టు 17 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే మార్చిలోను మదర్ డెయిరీ లీటర్ కు రూ. 2 చొప్పున ధర పెంచిన విషయం తెలిసిందే. సగటు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో పోలిస్తే లీటర్ కు రూ.2 పెంచడం తక్కువేనని ఫెడరేషన్ తెలపడం గమనార్హం. మరి ఈ పాల పెంపు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.