అమూల్ బ్రాండ్ పాల ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ పొందింది. వ్యాపార రంగంలో ఎలాంటి ప్రొడెక్ట్ అయినా సరే ప్రజల్లోకి చేరాలంటే దానికి పబ్లిసిటీ ఎంతో అవసరం. ఇలాంటి ప్రచారాలు ఎంతో క్రియేటీవ్ గా రూపొందిస్తుంటారు.
సాధారణంగా ఏ ఉత్పత్తి అయినా ప్రజల వద్దకు చేరాలంటే దానికి బలమైన పబ్లిసిటి ఉండాలి. పబ్లిసిటీ అనేది ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపార రంగానికి చెందిన వారు తాము ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ కి రక రకాలుగా యాడ్స్ రూపకల్పన చేసి ప్రజలకు తెలిసేలా చేస్తుంటారు. కొంతమంది పబ్లిసిటీని చాలా క్రియేటీవ్ గా చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలా క్రియేటీవ్ గా రూపొంది యాడ్స్ లో ఒకటి ‘అమూల్’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అమూల్ గర్ల్‌ను కంపెనీ నేటికీ కొనసాగుతున్నది. తాజాగా అమూల్ గర్ల్ ‘అట్టర్లీ బటర్లీ’ కార్టూన్ సృష్టికర్త ప్రఖ్యాత కార్టూనిస్ట్ సిల్వెస్టర్ డాచున్హా కన్నుమూశారు.
పాల ఉత్పత్తులో ఎంతో ప్రసిద్దిగాంచిన అమూల్ బ్రాండ్ పేరు చెప్పగానే ‘అమూల్ గర్ల్’ గుర్తుకు వస్తుంది. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌లో కనిపించే చిన్నారి ఎంతో ఆకర్షణగా అనిపిస్తుంది.. ఈ కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో కొత్త గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని అమూల్ బ్రాండ్ కి అమూల్ గర్ల్ కార్టూన్ సృష్టించారు ప్రముఖ కార్టూనిస్ట్ సిల్వెస్టర్ డకున్హా. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన జూన్ 20 ర ముంబైలో తుదిశ్వాస విడిచారు. ‘అట్టర్లీ-బటర్లీ’ ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్ గర్ల్ కార్టూన్‌ను ల్వెస్టర్ డకున్హా గీశాడు. ఆనాటి నుంచి దాని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఆర్ట్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఒకరకంగా ఈ కార్టూన్ అమూల్ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది.
సిల్వెస్టర్ డాకున్హా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన, జనరంజకమైన యాడ్స్ ని రూపొందించారు. యాడ్స్ రూపొందించడంలో ఆయన క్రియేటివీటీ చాలా గొప్పగా ఉంటుందని అందరూ అంటుంటారు. ఆయన చనిపోయే వరకు డాకున్హా కమ్యూనికేషన్స్ కంపెనీకి చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. మంగళవారం ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కో ఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయెన్ మెహతా ప్రకటించారు. సిల్వెస్టర్ డకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిగ్గజ కార్టూనిస్ట్ సిల్వెస్టర్ డాకున్హా మృతి పట్ల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Sylvester daCunha, Creator Of Iconic ‘Amul Girl’ Campaign, Dies https://t.co/N9RBkbiVTH pic.twitter.com/tbOSnZZMY5
— NDTV News feed (@ndtvfeed) June 21, 2023