ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు. అలానే సమాజంలో బాధ్యతగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తులు. వారు చేసే మంచిని చూసి నలుగురు నేర్చుకనే ప్రవర్తన ఉండాలి. కానీ కొందరు ఎమ్మెల్యే ప్రవర్తన మాత్రం రౌడీలకు ఏమాత్రం తీసిపోదు. అలానే తాజాగా ఓ ఎమ్మెల్యే ప్రవర్తించాడు.
ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు. అలానే సమాజంలో బాధ్యతగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తులు. వారు చేసే మంచిని చూసి నలుగురు నేర్చుకునేలా ప్రవర్తన ఉండాలి. కానీ కొందరు ఎమ్మెల్యే ప్రవర్తన మాత్రం రౌడీలకు ఏమాత్రం తీసిపోదు. పోలీసులను బెదిరించడం, బూతులు తిట్టడం ఓ ఫ్యాషన్ గా ఫీలవుతుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. ఇంకా దారుణం ఏమిటంటే గన్ తో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతుంటారు. చంపేస్తాను లేదా చస్తానంటూ ఓ ఎమ్మెల్యే గన్ తో హల్ చల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ మే 4న జరగగా.. రెండో దశ పోలింగ్ మే 11న జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గౌరీగంజ్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ సింగ్ భార్య బరిలో దిగారు. అమేఠీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్, బీజేపీ నేత దీపక్ సింగ్ మధ్య బుధవారం మధ్యాహ్నం గొడవ జరిగింది.
ఈక్రమంలో పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడినా చూసి చూడనట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ధర్నాకు దిగారు.
అక్కడి నుంచి లేపేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్ధి భర్త అయినా దీపక్ సింగ్ ను కాల్చేస్తానని, లేదంటే తానైనా కాల్చుకుంటానని పోలీసుల ఎదుట ఎమ్మెల్యే హల్ చల్ చేశారు. ఇరువ వర్గాలు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. చివరకు ఇరువర్గాలను అదుపులోకి తెచ్చిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని వారి కంట్రోల్ లోకి తీసుకున్నారు. మరి.. ఎమ్మెల్యే చేసిన ఈ హంగామాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.