అమాయక భక్తులను దొంగ లీలలతో మోసం చేసిన ఫేక్ బాబాల గురించి వినుంటారు. కానీ ఈయన మాత్రం వాళ్ల కంటే కాస్త భిన్నం. తన కింద తానే మంట పెట్టుకుని మాడిపోతున్నాడీ బాబా. మిగిలిన వివరాలు..
ఎన్నో మతాలు, ఎందరో దేవుళ్లు మన దేశంలో కొలువై ఉన్నారు. దేవుళ్లను నమ్మే, పూజించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్లు ఆరాధిస్తూ ఉంటారు. భక్తి, ఆధ్యాత్మికత అనేవి మనుషుల జీవితాల్లో, నడవడికలో, ఆలోచనల్లో మంచి మార్పులు తీసుకొస్తే ఎంతో బాగుంటుంది. ఇలా ఆధ్యాత్మికత ద్వారా భక్తుల్లో మరింత మంచి మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నవారు ఉన్నారు. అదే సమయంలో భక్తుల అమాయకత్వాన్ని వాడుకుని దోచుకుంటున్న వారూ ఉన్నారు. భక్తుల అవసరం, అమాయకత్వాన్ని కొందరు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మాయమాటలు చెప్పి వారి దగ్గర నుంచి దొరికినంత దోచుకుంటున్నారు. అలాంటి దొంగ బాబాల లీలలను వార్తల్లో చూసే ఉంటారు.
ఇప్పుడు మీరు మరో నయా బాబా గురించి తెలుసుకోబోతున్నారు. నోట్లో నుంచి శివలింగాలు తీసే బాబాల గురించి వినుంటారు. కానీ ఈయన వారి కంటే కాస్త వైవిధ్యం. ఈ బాబా మంటల మీద కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తారు. మంటల మీద ఓ ఇనుప పెనం పెట్టి, దానిపై కూర్చుని.. నోట్లో బీడీ పెట్టుకుని ఆయన దర్శనం ఇస్తారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, తివాసా తాలూకాలో దర్శనం ఇస్తున్న ఈ బాబా పేరు సంత్ గురుదాస్ మహారాజ్. తన వద్దకు వచ్చే భక్తుల కష్టాలను ఆయన తొలగిస్తున్నారట. ఆయన చెప్పినవి చెప్పినట్లే జరుగుతుండటంతో గురుదాస్ దర్శనానికి రోజూ వందలాది మంచి క్యూ కడుతున్నారట. మరి.. తన కింద తానే మంట పెట్టుకుని మాడిపోతున్న ఈ బాబా కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.