సినిమా తారలెందరో వెండితెరపై జైజైలు పలికించుకుని.. ఆ తర్వాత ప్రజా సేవకై రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వీటికి ఆద్యం పోసిందీ తమిళనాడు. సిఎన్ అన్నాదురై, కరుణానిథి, ఏంజీఆర్‌ల తరం నుండి నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారే. అటువంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు శరత్ కుమార్. ప్రాంంతీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన.. ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించారు. ..
సినిమా తారలెందరో వెండితెరపై జైజైలు పలికించుకుని.. ఆ తర్వాత ప్రజా సేవకై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. పెడుతున్నారు. వీటికి ఆద్యం పోసిందీ తమిళనాడు. సిఎన్ అన్నాదురై, కరుణానిథి, ఏంజీఆర్‌ల తరం నుండి నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చిన వారే. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిది వంటి వారు ముఖ్యమంత్రి పదవులను అధిరోహించారు. అయితే మరికొంత స్టార్ నటులు కూడా పార్టీలను ఏర్పాటు చేసి.. ఎన్నికల్లో్ తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ప్రముఖ నటుడు శరత్ కుమార్. తొలుత నెగిటివ్ పాత్రలతో పరిచయమైన ఆయన.. తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రలో, ఆ తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. రాధిక భర్తగానే కాకుండా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. తొలుత డిఎంకెలో, ఆ తర్వాత అన్నాడిఎంకెలో చేరారు. 2007లో సొంత పార్టీని ఏర్పాటు చేశారు. దీని పేరు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి.
అయితే ఇటీవల మధురైలో పార్టీ 7వ మహా సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్టాడుతూ ‘2026లో ముఖ్యమంత్రిని చేస్తే 150 ఏళ్లు జీవించే రహస్యం చెబుతాన‘ని అన్నారు. ఈ మహాసభలో ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించేందుకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పుడు 69 ఏళ్లు.. కానీ 25 ఏళ్ల వ్యక్తిగానే భావిస్తాను. నేను 150 ఏళ్లు బతుకుతాను. వచ్చే ఎన్నికల్లో నన్ను సీఎంని చేస్తే అన్నేళ్లు బతికే ఉపాయం చెబుతా’అంటూ వ్యాఖ్యానించారు. ధృడ సంకల్సం ఉన్న నాయకుడే నాయకుడని, జాతీయతకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. వీటన్నింటికీ కృషి, నిజాయితీ, శారీరక, మానసిక బలం అవసరమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి. కొంత మంది పాజిటివ్ గా, కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?
‘ఆల్కహాల్ దేహాన్ని కుంగదీసి ఒత్తిడిని కలిగిస్తుంది. నేడు రకరకాల మాదకద్రవ్యాలు వచ్చేస్తున్నాయి. గంజాయి, గుట్కా అనేక రకాలుగా మత్తుపదార్థాలు దొరుకుతున్నాయి. వీటిని నియంత్రించాలి. 2025 నాటికి భారత్ ధనిక దేశంగా మారాలని యువత భావిస్తున్నారు. కానీ, ఆ యువత మత్తులో చిత్తు చేసేందుకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుంది’ అన్నారు. ’డ్రగ్స్‌కు బానిసలయ్యే స్కూల్ పిల్లలను నేను స్వయంగా చూశాను. డ్రగ్స్ నియంత్రణకు, పిల్లల పర్యవేక్షణకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ వివిధ రూపాల్లో భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. మద్యం దుకాణాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేయకపోవడం ద్వారా మద్యనిషేధం తీసుకురావచ్చు’ అంటూ మద్య పాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. శరత్ కుమార్ ఈ ఏడాది ‘పొన్నియన్ సెల్వన్-2’, ‘కస్టడీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.