నేపాల్ లోని తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం తాజాగా గల్లంతైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 19 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఉండడం విశేషం. కాగా ఆదివారం ఈ విమానం ఉదయం పోఖ్రా నుంచి జమ్సోమ్ కి బయల్దేరిన ఈ విమానం కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఇది కూడా చదవండి: Sonu Sood: చిన్నారికి నాలుగు చేతులు, కాళ్లు.. మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్
ఇక ఈ విమానంలో సిబ్బందితో పాటు 22 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా నేపాల్ అధికారిక మీడియా తెలిపింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని సమాచారం. ఈ సమాచారాన్ని అందుకున్న ముస్తాంగ్ జిల్లా డీఎస్పీ రామ్ కుమార్ దని విమానం ఆచూకిని తెలుసుకునేందుకు రెండు ప్రత్యేక విమానాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఇక వీటితో పాటు నేపాల్ సైనిక విమానం ఎంఐ-17ని కూడా గల్లంతైన విమానాన్ని గాలించేందుకు సెర్చ ఆపరేషన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది చదవండి: Sonu Sood: చిన్నారికి నాలుగు చేతులు, కాళ్లు.. మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్
నేపాల్‌లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయ్యింది. 22 మంది ప్రయాణీకులతో పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా విమానం ఘమ్సీ ప్రాంతంలో కుప్పకూలి పోయింది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అదృశ్యమైన విమానం కూలినట్లు, భారీ శబ్దాలు విన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఫ్లైట్‌లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.