ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతికలోపం, వాతారవణం అనుకూలించకపోవడం.. ఇలా కారణం ఏదైనా విమానాలు, హెలికాఫర్ట్ లు కూలిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని ప్రమాదాల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. ఇటీవలే నేపాల్ లో ఓ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మధ్యప్రదేశ్ లో విమానాల ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న రెండు విమానాలు అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయాయి.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పైలట్లకు యుద్ధ విమానాలను నడపడంలో ఉన్నతాధికారులు శిక్షణ ఇస్తున్నారు. సుఖోయో-30, మిరాజ్ యుద్ధ విమానాలతో పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా గ్యాలియర్ నుంచి టేకాఫ్ అయినా సుఖోయో-30, మిరాజ్ అనే యుద్ధ విమానాలు మెరెనా ప్రాంతంలోని కొండలపై కుప్పకూలిపోయాయి. ఒకదానిని మరొకటి ఢీ కొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు అందించిన సమాచారంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో యుద్ధ విమానాలు కూలాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురికి గాయలైనట్లు సమాచారం. ఈ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. ఇలా విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులు అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ చౌదరిలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఇది జరిగిన గంటల వ్యవధిలో రాజస్థాన్ లో మరో విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు గంటల వ్యవధిలో ఇలా విమానాలు కూలిపోయిన ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.