ఇటీవల పలు చోట్ల విమాన ప్రయాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రయాణించినవారు గాల్లోనే కలిసిపోతున్నారు. కొన్నిసమయాల్లో పైలెట్ల సమయస్ఫూర్తితో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులు ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మద్య వరుసగా అవుతున్నాయి.
ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయంనే టెక్నికల్ ఇబ్బందులు, పక్షలు ఢీ కొట్టడం, రన్ వే పై ల్యాండ్ అయ్యే సమయంలో ఏదో ఒక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే విమాన సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో అక్కడ ఇటింటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ విమానం ప్రమాదానికి గురైంది.. కాకపోతే ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తిరవనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేరళా కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరెబియా దమ్మం కి బయలు దేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రేస్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే వెనుకభాగం నేలకు తాకి పూర్తిగా దెబ్బతిన్నదన్న విషయాన్ని పైలెట్ గమనించాడు. వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసేందుకు విలుగా ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశాడు. ఆ తర్వాత ఫ్టైట్ ని తరువనంతపురం విమానాశ్రయంలో ఎమెర్జెన్సీగా ల్యాండ్ చేశాడు. ఈ విమానంలో మొత్తం 182 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
కాలీకట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలోనే నేలకు తాకి వెనుకభాగం ధ్వంసం అయిన విషయం వెంటనే పైలెట్ గమనించి అప్రమత్తమై.. సమయస్ఫూర్తితో తిరువనంతపురం లో అత్యవసర ల్యాండింగ్ చేశారని అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని.. వారిని దమ్మం కి తీసుకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మద్యనే అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.