. కొద్ది పరిచయానికి స్నేహం అని పేరు పెట్టి.. అవసరానికి ఒకడ్ని వినియోగించుకుంటున్నారు. అతడ్ని నిండా ముంచాక. మరొకరతో స్నేహ గీతం పాడుతూ.. పాత ఫ్రెండ్‌కు రామ్ రామ్ చెప్పేస్తున్నారు. ఓ వ్యక్తి చనిపోతే.. అతడు తన స్నేహితుడని చెప్పి.. అతడి శవంపై కూర్చొని పూజలు చేశాడో వ్యక్తి.
మానవ సంబంధాల్లో స్వచ్చమైనదీ, విలువైనదీ స్నేహ బంధం అంటుంటారు. చిన్న చిన్న అలకలతో పాటు దాపరికాలు లేని అందమైన బంధం అది. కానీ నేటి సమాజంలో అన్ని బంధాలు కుంచించికుపోయినట్లే స్నేహ బంధం కూడా బీటలు వారింది ఫ్రెండ్ షిప్ ముసుగులో దారుణాలకు ఒడిగడుతున్నారు. కొద్ది పరిచయానికి స్నేహం అని పేరు పెట్టి.. అవసరానికి ఒకడ్ని వినియోగించుకుంటున్నారు. అతడ్ని నిండా ముంచాక. మరొకరతో స్నేహ గీతం పాడుతూ.. పాత ఫ్రెండ్‌కు రామ్ రామ్ చెప్పేస్తున్నారు. ఓ వ్యక్తి చనిపోతే.. అతడు తన స్నేహితుడని చెప్పి.. అతడి శవంపై కూర్చొని పూజలు చేశాడో వ్యక్తి. అతడి ఆత్మకు శాంతి కలిగిస్తానంటూ ధాన్యం చేస్తూ మంత్రాలు చదువుతుండంతో మృతదేహాన్ని చూడటానికి వచ్చిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. సూలూరు సమీపంలోని కురుంబపాళయంలో మణికంఠన్ కుటుంబం నివసిస్తోంది. ఇతడికి ఓ కుమారుడు ఉన్నారు. అయితే అంబులెన్స్ డైవర్‌గా పనిచేస్తున్న మణికంఠన్.. భార్యాబిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఏదో విషయంపై ప్రియురాలితో మణికంఠన్ గొడవపడ్డాడు. దీంతో ఆవేశంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఎక్కడి నుండో ఊడిపడ్డాడు అఘోరా. తన సహచరులతో వచ్చిన అతడు.. మణికంఠన్ తన స్నేహితుడని, అతడి ఆత్మ శాంతించడం కోసం పూజలు చేయాలంటూ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అతడి వాలకాన్ని చూసి భయపడ్డా.. చివరకు చేసేదీ లేదక.. కుటుంబ సభ్యులు అంగీకరించారు. వెంటనే మణికంఠన్ మృతదేహంపై కూర్చుని మంత్రాలు చదువుతుండటంతో.. చూసే వారు భయభ్రాంతులకు గురయ్యారు. పూజలు అనంతరం అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే అతడి చర్యను కొంత మంది తప్పుపట్టారు.