భార్యాభర్తల మధ్య గాఢమైన ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల ప్రేమ మరణం చివరి వరకు ఉంటుంది.. మధ్యమధ్యలో ఎన్నో గొడవలు వచ్చినా కూడా సర్దుకుంటూ జీవితాన్ని సాగిస్తారు. పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని దూరం వెళ్లిపోయాక కూడా దంపతులు ఇద్దరు ధైర్యంగా ఉంటారు. వారికి వృద్దాప్యం మీద పడిన ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి ఉంటారు. ఆ వయస్సులో ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అందుకే ఇద్దరిలో ఏ ఒక్కరికి బాగాలేకున్న మరొకరు తట్టుకోలేరు. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలను మనం చూశాం. తాజాగా భార్యాభర్తల బంధానికి, ప్రేమలకు ఓ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. చనిపోయిందనుకున్న తన భార్య.. తొమ్మిదేళ్ల తరువాత తిరిగి రావడంతో ఆ భర్త ఆనందానికి అవధులేకుండా పోయాయి. మరీ.. ఈ తొమ్మిదేళ్ల ఎడబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హర్యానా రాష్ట్రానికి చెందిన కేహర్, దర్శిని భార్యాభర్తలు. వీరిద్దరు బతురుదెరువు నిమిత్తం చాలా ఏళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఢిల్లీలో స్థానికంగా పనిచేసుకుంటా పిల్లలను పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలను చదివించి కొందరికి పెళ్లిళ్లు చేశారు. కేహర్ కు భార్య దర్శిని అంటే చచ్చేంత ఇష్టం. ఆమెకు ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేడు. దర్శిని కూడా అంతే పిల్లలతో పాటు తన భర్తను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది. అలా ఆ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా తమ సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే వారి ప్రేమను చూసిన విధికి కన్నుకుట్టినట్లు ఉంది. దర్శినికి మానస్థితి సరిగ్గా ఉండేది కాదు. అయినా భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు కేహర్. అయితే ఒక్కసారి ఉన్నట్లుండి దర్శిని కనిపించకుండా పోయింది.
ఆమె కోసం ఆయన ఎంతో పరితపించాడు. పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలించాడు. చివరకు విసుకు చెంది.. తాను బతికి ఉన్న జీవచ్ఛవంలా బతుకుని వెల్లదీస్తున్నాడు. ఆమె ఎక్కడో ఒకచోట బతికే ఉంటుందని కేహర్ బలంగా నమ్మాడు. ఎప్పుడో ఒకసారి తిరిగిరాకుండా పోతుందా? అనే ఆశతో భార్యకోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. ఇంతలోనే కరోనా మహమ్మారి రావడంతో వేలది మంది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఎన్నో అనాథ శవాలను సైతం ప్రభుత్వాలు ఖననం చేశాయి. ఈ నేపథ్యంలో తన భార్యను కూడా ఈ కరోనా మహమ్మారి బలితీసుకుని ఉంటుందని కేహర్ భావించాడు. ఇక తన భార్యలేదని గత రెండేళ్లు నుంచి తీవ్ర వేదన చెందుతున్నాడు. అయితే ఇప్పటికే దర్శిని కనపడక దాదాపు తొమ్మిదేళ్లు గడిపోయింది. ఇదే సమయంలో ఇటీవల కేహర్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
తాము కర్ణాటక రాష్ట్రంలోని కొడగు ప్రాంతం నుంచి మాట్లాడుతున్నట్లు కొందరు చెప్పారు. ‘మీ భార్య మా వద్ద ఉంది’ అని వాళ్లు కేహర్ కు తెలిపారు. వారు చెప్పిన మాటలకు కేహర్ కు పోయిన ప్రాణం లేచివచ్చినట్లు అనిపించింది. వెంటనే కర్ణాటకకు వెళ్లి.. భార్యను కలుసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం మడకేరి ప్రాంతంలో దీనస్థితిలో దర్శిని కనిపించినట్లు థానేషెల్టర్ సంస్థ సభ్యులు తెలిపారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని గుర్తించి.. ఆమెకు చికిత్స చేయించామని తెలిపారు. మాములు స్థితికి వచ్చిన తరువాత సమాచారం సేకరించి.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేశామని థానే షెల్టర్ సభ్యులు తెలిపారు. వారి చేసిన సాయానికి కేహర్ కృతజ్ఞత తెలిపాడు. అనేక ట్విస్టుల తరువాత క్లైమాక్స్ లో శుభం కార్డు వేసుకున్న ఈ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.