దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ సమయంలో మనమందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ విషయంలో మన చెల్లెల్లకు అండగా నిలవాల్సిన బాధ్యత మనది. దయచేసి ఎవరూ కూడా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇది మనందరికీ పరీక్ష సమయం. దేశ పౌరులుగా బాధితుల తరుఫున వారికి మనం అండగా నిలుద్దాం అంటూ తెలిపాడు.
Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims.
Be responsible 🙏— sonu sood (@SonuSood) September 18, 2022
విషయం ఏంటంటే? చండీగఢ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ యువతి తన హాస్టల్ మెట్స్ అయిన 60 మంది అమ్మాయిలు స్నానాలు చేస్తుండగా సీక్రెట్ గా మొబైల్ ఫోన్ తో వీడియోలు తీసింది. ఇక ఇంతటితో ఆగకుండా తన ఫ్రెండ్స్ కు షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతులు శనివారం రాత్రి యూనివర్సిటీ ఎదుట నిరసనకు దిగారు. దీంతో కొంతమంది యువతులు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు.
దీనిపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి సైతం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాజాగా ఇదే అంశంపై సోనూ సూద్ స్పందించి బాధితులకు అండగా నిలిచారు. తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సోనూ సూద్ ట్విట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022