Chennai: మహా నగరాల్లో ట్రాఫిక్ సమాస్యల నుండి బయటపడాలంటే మెట్రో రైళ్ళే దిక్కు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద నగరాల్లోని ఎక్కువగా మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య తగ్గిందనుకుంటే.. ఇప్పుడు శబ్ద కాలుష్యం ఎక్కువైందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.
మెట్రో రైలులో ప్రయాణించే వారికి ప్రశాంతంగా ఉన్నా.. పట్టాల మీద అది నడిచే సమయంలో అధిక శబ్దం వస్తుంది. ఈ కారణంగా శబ్ద కాలుష్యం ఉంటుందని అధికారులు అంటున్నారు. అందుకే శబ్ద కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడ్డారు అధికారులు. చెన్నైలోని అడయార్ నగరంలో తిరిగే మెట్రో రైళ్ళ శబ్దాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా మెట్రో కారిడార్లను నిర్మించి.. రెండు మార్గాల్లో మెట్రో రైళ్ళను నడుపుతున్న విషయం తెలిసిందే. వింకో నగర్ నుంచి ఎయిర్ పోర్టు మధ్య పిల్లర్లతో నిర్మించిన రైలు మార్గంపై రైళ్ళు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళు నడిచే సమయంలో శబ్దం అధికంగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా పట్టాలకు గ్రీజ్ పూసే అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు టెండర్లకు ఆహ్వానం పలికింది. ఈ యంత్రాల సాయంతో గ్రీజ్ వేయడం వలన పట్టాలు, రైలు చక్రాల మధ్య రాపిడితో పాటు శబ్దం కూడా తగ్గుతుందని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఐడియా భలే ఉంది కదా. మరి ఈ అధికారుల ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: రోడ్డుపై పడిపోయిన 2 వేల వైన్ బాటిల్స్! వీళ్ళు రియల్ హీరోలు అంటే!
ఇది కూడా చదవండి: Cuddle Therapy: అతడి కౌగిలికి భలే డిమాండ్.. గంటకు రూ. 7వేలు!