నేటికాలంలో మనుషుల్లో సాటి మనిషికి సాయం చేసే గుణం కరువైంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడితే మనంకేటి అనుకుంటారు. కానీ పూర్వ కాలంలో ఎదుటి వారికి విభిన్న ఆచారాల పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆదుకునేవారు. అలాంటివి ఇప్పటి కొన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. ఆ కోవకు చెందినదే “మోయి విరుందు” అనే ఆచారం. ఇది ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. మరి ఆ సాంప్రదాయ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
తమిళనాడులో “మోయి విరుందు” అనే భిన్నమైన ఆచారం ఉంది. తెలుగులో మోయి విరుందు అంటే చదివింపుల విందు అని అర్థం. ఈ విందు. రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది ఈ విందు. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఇది.. రెండేళ్ల తరువాత మోయి విరుందు ద్వారా గ్రామాలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ సీన్ చూసే వాళ్లకి చినరాయుడు సినిమాలో ఓ సన్నివేశం గుర్తొస్తుంది. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా కావేరి తీరంలో ఉండడంతో పూర్తిగా వ్యవసాయాన్ని నమ్ముకున్నారు అక్కడి రైతులు.ఈ జిల్లాలో రైతులు వ్యవసాయం కోసం బ్యాంకులో వడ్డీ లేని రుణాలకు అస్సలు అంగీకరించరు. దీనికి కారణం ఈ జిల్లాలో జరిగే చదివింపుల విందు.
ఏటా జులై నెల నుంచి అక్టోబర్‌లోపు జరిగే ఈ విందులు.. కరోనా కారణంగా రెండేళ్లు నుంచి జరగడం లేదు. దీని ప్రభావం రైతులపై తీవ్రంగా పడింది. మళ్లీ రెండేళ్ల తరువాత “మోయి విరుందు”కి జిల్లాలో గ్రామస్థులు అంగీకరించడంతో ఎక్కడిక్కడ సందడి వాతావరణం నెలకొంది.ఎవరైనా వ్యసాయానికి, వ్యాపారానికి ఆర్థికంగా నగదు అవసరమైనప్పుడు ఈ విందు ఏర్పాటు చేస్తారు. వచ్చిన వారంతా భోజనం చేసి వెళ్లేటప్పుడు చదివింపులు చదివిస్తారు.ఈ చదివింపులలో ముఖ్య నిబంధన ఏంటంటే.. ఎవరెవరు ఎంత రాశారో తెలుసుకుని.. తిరిగి దానికంటే కొంచెం ఎక్కువగా.. మళ్లీ రాసినవాళ్లు విందు ఏర్పాటు చేసినప్పుడు చదివింపులుగా చదివించాలి.మరి..”మోయి విరుందు” సాంప్రదాయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.