ప్రజాప్రతినిధులు అంటే ప్రజలపై అధికారాన్ని చెలాయించడమే కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పెత్తనం చెలాయించే నేతల అనేకమంది ఉంటారు. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే నేతలు మాత్రం కొందరే ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ కౌన్సిలర్ తాజాగా తన ప్రాంతంలోని ప్రజల సమస్యను తానే స్వయంగా పరిష్కరించాడు. మురికి కాలువ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. తానే మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశాడు. అనంతరం ఆయన చేసిన ఈ మంచి పనికి స్థానికులు పాలాభిషేకం చేశారు. ఈఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని తూర్పు ఢిల్లీకి చెందిన ఆప్ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ కి స్థానికంగా ఓ పార్క్ సమీపంలో ఉన్న మురికి కాలువు లో నీరు పొంగిపొర్లుతుందని ఫిర్యాదు అందింది. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంలేదని ఆ కౌన్సిలర్ ..తానే స్వయంగా రంగంలోకి దిగానంటూ ఆయన ఆ మురికి కాలువలోకి దూకడు. ఆ తర్వాత.. తన సహాయకుల సహాయంతో దానిని క్లీన్ చేయడానికి కావాల్సిన పరికరాలను అందుకొని.. దానిని శుభ్రం చేయడం మొదలు పెట్టాడు. దానిని శుభ్రం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మద్దతుదారులు ఆయనకు పాలతో అభిషేకం చేశారు.
యన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాను తలపించేలా..ఆయనకు వారు పాలాభిషేకం చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. అందుకే తానే స్వయంగా సమస్య పరిష్కారానికి పూనుకున్నట్లు కౌన్సిలర్ తెలిపాడు. మరి.. ఈ కౌన్సిలర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.