ప్రేమ.. ఈ రెండక్షరాల పదం వయసులతో సంబంధం లేకుండా ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో తెలియదు. తాజాగా కోయంబత్తూరులోని ఓ మైనర్ బాలుడిపై కన్నేసింది 19 ఏళ్ల యువతి. చివరికి మాటా మాటా ఎలా కలిపింది. అసలు మైనర్ బాలుడిని పెళ్లి చేసుకోవటానికి కారణం ఏంటన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతం. ఓ స్థానిక పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది ఓ యువతి. ఈ క్రమంలోనే పెట్రోల్ కోసమని బంక్ లోకి వచ్చిన ఓ మైనర్ బాలుడిని చూసింది ఆ అమ్మాయి. దీంతో ఆ యువకుడు రోజు పెట్రోల్ కోసం రావటంతో అలా అతడితో మాట మాట కలిపి ముగ్గులోకి లాగేసింది. దీంతో ఆ యువతి ఎట్టకేలకు ఆ మైనర్ బాలుడిని ట్రాప్ లోకి దింపి లవ్ వరకూ తీసుకెళ్లింది. తర్వాత ఇద్దరూ ఫోన్ లో తరుచూ మాట్లాడుకోవటం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఆ బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. దీంతో ఎలాగైన చికిత్స పొందుతున్న మనోడిని చూడాలని భావించిన ఆ యువతి ఆస్పత్రికి చేరుకుంది. ఇక వీరిద్దరి ప్రేమాయణం బాలుడి తల్లిదండ్రులకు తెలియటంతో ఆ యువతిని మందలించారు. అయినా తీరు మార్చుకోని ఆ యువతి ఎలాగైన ఆ బాలుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయంతో ఉంది. దీంతో పథకం ప్రకారమే ఇద్దరు డిండిగల్ జిల్లాకు పారిపోయి ఓగుడిలో వివాహం చేసుకున్నారు. ఇక మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న ఆయువతి తీరుపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ యువతిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.