గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురి సదర్ కొత్వాలి ప్రాంతంలో ఉన్న శివాలయంలో స్థానికులు భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం ఈ భజన కార్యక్రమంలో రవి శర్మ అనే కళాకారుడు హనుమాన్ వేషధారణలో గణేష్ మండపంలో లైవ్ ప్రదర్శన ఇచ్చాడు. భజన పాటలకు ఉత్సాహంగా ప్రదర్శన ఇస్తూ అక్కడున్న పెద్దలను, పిల్లల్ని అలరించాడు. మరి ఏమైందో ఏమో గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. ప్రదర్శనలో భాగంగా కింద పడ్డాడనుకున్నారు అందరూ.
కానీ ఎంతసేపటికీ లేవకపోవడంతో అక్కడున్న వారు అనుమానంతో లేపగా.. రవి శర్మ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే ఆ యువకుడ్ని మెయిన్ పురి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమాన్ వేషధారణతో ప్రదర్శన చేస్తూ తనువు చాలించిన రవి శర్మపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#मैनपुरी
गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिराहनुमान जी का रूप धर नाच रहा था युवक
जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया
मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4
— Network10 (@Network10Update) September 4, 2022
ఇది కూడా చదవండి: బ్రేకింగ్: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి..