రెండు అక్షరాల ప్రేమ.. మనిషిని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుందనే కొందరి అభిప్రాయం. కొందరికి ప్రేమే బలం, అదే బలహీనత. అలాంటి ప్రేమ కోసం చాలా మంది చాలా త్యాగాలు చేస్తుంటారు. ఈ ప్రేమ అనేది ఎవరి మధ్య ఎప్పుడు? ఎలా? పుడుతుందో కూడా ఎవరికి తెలియదు. తాజాగా ఓ ఇద్దరి అమ్మాయిల మధ్య పుట్టిన ప్రేమ.. దారుణమైన నిర్ణయానికి పునాది వేసింది. ప్రేమిస్తున్నాను అని చెప్పి ఓ యువతి మరో యువతిని పురుషుడిగా మారేలా చేసి.. ఆపై మోసగించింది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని మధుర ప్రాంతానికి చెందిన జయసుధ, సెంథిల అనే ఇద్దరి అమ్మాయిలు మంచి స్నేహితులు. మొదట్లో ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారు. అలా ఆ ఇద్దరు యువతులు అనేక విషయాలను షేర్ చేసుకుంటుండేవారు. ఈ క్రమంలో వీరిద్దరికి ఒకరిపై మరొకరి ఇష్టం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జయసుధను పురుషుడిగా మారాలని సెంథిల ఒత్తిడి చేసింది. 2021 మధురై ప్రభుత్వం రాజాజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని పురుషుడిగా మారింది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది.
అనంతరం ఆదిశివ, సెంథిల ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. దీంతో సెంథిల కుటుంబ సభ్యులు తిరుప్పరకుండ్ర పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదిశివకు సెంథిల షాక్ ఇచ్చింది. తన తల్లిదండ్రులతో వెళ్లిపోతానని చెప్పింది. దీంతో తన కోసం పురుషుడిగా మారినాను, ఇప్పుడు తన పరిస్థితి ఏంటని, తనకు తగిన న్యాయం చేయాలని స్థానిక కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.