చిన్న పిల్లల దగ్గర నుండి ముదసలి వరకు అందరి చేతుల్లో మొబైల్సే. అలాగే టైమ్ పాస్ కావడానికి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా యాపులతో పాటు ఆడుకోవడానికి అనేక గేమ్స్ వచ్చేశాయి. అయితే గేమ్స్ విషయంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే.. పబ్జీకుండే క్రేజ్ మరో ఎత్తు.
మొబైల్ ఫోన్లు అందులోనూ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఎంత మందికి మేలు కలిగిందో తెలియదని కానీ, నష్టం అయితే చెప్పలేనంత జరిగిందనే చెప్పవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి ముదసలి వరకు అందరి చేతుల్లో మొబైల్సే. అలాగే టైమ్ పాస్ కావడానికి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా యాపులతో పాటు ఆడుకోవడానికి అనేక గేమ్స్ వచ్చేశాయి. అయితే గేమ్స్ విషయంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే.. పబ్జీకుండే క్రేజ్ మరో ఎత్తు.. దీనికి చాలా మంది ఎడిక్ట్ అయ్యారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఈ గేమ్‌లో ఆడి పిచ్చి వాళ్లుగా మారిపోయినవారున్నారు.
వయెలెన్స్ ఎక్కువగా ఉందని, ఇతర కారణాలతో పబ్బీ గేమ్‌పై భారత్‌లో బ్యాన్ విధించారు. బీజీఎం వంటి రూపాల్లో డౌన్ లోడ్ చేసుకుని ఆడేస్తున్నారు. ఈ గేమ్ వల్ల ప్రాణాలు పొగొట్టుకున్న వారు ఉన్నారు. అయితే పబ్జీ గేమ్ ఓ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఆన్ లైన్‌లో పబ్జీ ఆడుతూ ప్రేమలో పడిన పాకిస్తాన్‌కు చెందిన యువతి.. ప్రియుడి కోసం ఏకంగా భారత్ వచ్చేసింది. భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో భారత్‌లో ఉండే తన ప్రియుడి కోసం ఇక్కడకు వచ్చి కాపురం పెట్టింది. పోలీసులకు ఈ విషయం తెలిసి.. అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
నోయిడాకు చెందిన యువకుడు సచిన్‌తో పాకిస్తాన్‌కు చెందిన సీమా గులామ్ హైదర్‌కు ఆన్ లైన్ పబ్బీ ద్వారా పరిచయమేర్పడింది. వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. అతడి కోసం కట్టుకున్న భర్తను వదిలి.. సచిన్ ఉండే ఉత్తరప్రదేశ్‌కు పయనమైంది. తన నలుగురి పిల్లల్ని తీసుకుని నేపాల్ గుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా.. ఉత్తరప్రదేశ్ చేరుకుంది. అక్కడి నుండి బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చింది. అనంతరం సచిన్ అక్కడ ఓ ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అయితే స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంటి ఓనర్ బ్రిజేష్ మాట్లాడుతూ.. తాము కోర్టు మ్యారేజ్ చేసుకున్నామని, తమకు నలుగురు పిల్లలని చెబితే.. ఇళ్లు అద్దెకు ఇచ్చానని చెప్పారు. ఆమె కట్టు, బొట్టు చూసి ఎక్కడా ఆమె పాకిస్తాన్ కు చెందిన మహిళగా అనుమానం రాలేదని తెలిపారు.