తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసులు ఎవరు అనే విషయంపై ఇప్పటికి వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లు జయలలిత ఆస్తులకు వారసులుగా ఉన్నారు. ఇక ఇప్పటివరకు జయలలిత వారసురాలిని నేనంటే నేను అంటూ చాలామంది తెరమీదకు వచ్చారు. తాజాగా మరోసారి జయలలిత వారసురాలి వివాదం తెరమీదకు వచ్చింది. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబుల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: శోభన్ బాబు, జయలలితల కూతురు గురించి చెప్పిన భరద్వాజ
మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38 ఏళ్ల మీనాక్షి తన తండ్రి శోభన్ బాబు అని, తల్లి జయలలిత అని.. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న తన తల్లి మృతి చెందినందుకు తనకు వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ 2022, జనవరి 27న ఆన్‌లైన్‌లో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. ఇది చూసిన అధికారులు బిత్తరపోయారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయ పడ్డారు. ఇక దరఖాస్తు చేసుకుని నెల దాటడంతో.. మీనాక్షి తాలూకా కార్యాలయానికి వచ్చి, డిప్యూటీ తహసీల్దార్ వద్దకు వెళ్లి తనకు వారసత్వ సర్టిఫికేట ఇవ్వాలని కోరింది.
ఇది కూడా చదవండి: జయలలిత వేద నిలయంలో గృహ ప్రవేశం చేసిన మేనకోడలు దీప
ఈ క్రమంలో అధికారులు మీనాక్షి తన తల్లిగా పేర్కొన్న జయలలిత.. చెన్నైలో మరణించింది కనుక.. అక్కడికెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. అందుకు నిరాకరించిన మీనాక్షి.. తన తల్లిదండ్రులు మృతి చెందడంతో తాను అనాథగా మారానని.. పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి శోభన్ బాబు తనకు ఇచ్చారని.. దానికి సంబంధించిన పత్రాలు పొందానని.. అలాంటిది వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరని అధికారులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాక తల్లి జయలలిత బాల్యంలోనే తనను వదిలేసిందని.. బామ్మ దగ్గర పెరిగానని తెలిపింది. దీనిపై స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ న్యాయస్థానానికి వెళ్లి హక్కుల గురించి చెప్పి ఆదేశాలు తీసుకోమని మీనాక్షిని అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడులో కలకలం రేపుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: స్టాలిన్ అద్భుత నిర్ణయం.. జయలలిత, పళనిస్వామి ఫొటోలు తొలగించొద్దని ఆదేశం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.