సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానాలు చెల్లించే క్రమంలో కొందరు అత్యుత్సాహం చూపిస్తారు. చలానా విధించిన పోలీసులపైనే నడి రోడ్డుపై తిరగబడుతుంటారు. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలానే చూశాం. అయితే తాజాగా ఓ యువకుడికి హెల్మెట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల చలానా విధించారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేనే అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏవి? ఇంతకు ముందు చలనాలు కట్టాను. ఇప్పుడు మాత్రం కట్టను. అని ట్రాఫిక్ పోలీసులనే ప్రశ్నించాడు ఆ యువకుడు. దాంతో ఆ యువకుడికి క్షణాల్లో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పోలీసులు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బెంగళూర్ కు చెందిన ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ ను నడపడంతో.. ట్రాఫిక్ పోలీసులు అతడికి చలానా విధించారు. ఈ విషయంపై ఆ యువకుడు అత్యుత్సాహాం చూపించబోయాడు. పోలీసులు విధించిన చలానాను ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసి..”ఆ ఫోటోలో ఉన్నది నేనే అనడానికి మీ దగ్గర ఆధారం ఏముంది? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. పూర్తి పిక్ పంపండి లేదా? చలానా రద్దు చేయండి” అంటూ.. పోలీసులకే సవాల్ విసిరాడు. ఈ పోస్ట్ ను బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. పోలీసులకే సవాల్ విసిరితే వారు ఊకుంటారా? క్రిమినల్ బ్రైన్ ఉన్న నీకే అంతుంటే.. క్రిమినల్స్ ను పట్టుకునే మాకెంతుండాలి అన్నట్లుగా.. క్షణాల్లోనే ఆ యువకుడి ప్రశ్నకు కౌంటర్ ఇచ్చారు పోలీసులు.
ఈ క్రమంలోనే సదరు యువకుడు హెడ్ సెట్ పెట్టుకుని బైక్ నడిపే పూర్తి ఫోటోను అతడి ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు. అంతే.. వారి నుంచి వచ్చిన కౌంటర్ చూసి కళ్లు బైర్లు కమ్మాయి మనోడికి. వెంటనే దార్లోకి వచ్చిన యువకుడు “ఫ్రూప్ చూపించినందుకు ధన్యవాదాలు.. ఓ పౌరుడిగా ఈ విషయం గురించి మిమ్మల్ని అడిగే హక్కు అందరికి ఉంది. నేను జరిమానా చెల్లిస్తాను” అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన తప్పు తెలుసుకుని మెుదటి ట్వీట్ ను డిలీట్ చేశాడు. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొంత మంది పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది బాసు అంటూ.. యువకుడిపై సెటైర్లు పేలుస్తున్నారు.
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022
Thank you for the Evidence. As a common public every one has the rights to ask this. I appreciate @blrcitytraffic for clarifying on this. I will pay the fine. Kudos to all the meme contents. #bangaloretraffic
— Felix Raj (@chrisfe143) October 20, 2022