ఒకప్పుడు ఆపదలు వస్తే ఎంతో మంది తమ వారి ఆపద భావించి సహాయం చేయడానికి ముందు వచ్చేవారు. నేటి కాలంలో మంచితనం చచ్చిపోయిందా, మానవత్వం మటకలిసిందా అన్న విధంగా ఉంది మనుషుల ప్రవర్తన. ఎదుటి వారు ఆపదలో ఉన్న మనకెందుకులే అని అనుకుంటారు. ఎవరైన ప్రమాదంలో ఉంటే సహాయం చేయడానికి ఒక్కరు ముందుకు రారు. సహాయం చేయకపోగా అక్కడి ఇన్సిడెంట్ ను తమ ఫోన్ లో చిత్రికరించే పనిలో ఉంటారు. ఇలాంటి కాలంలో కూడా ఆకాశంలో తారాల కొందరు మానవత్వాన్ని కలిగి ఉన్నారు.దానికి నిదర్శనం ఓ పాప. రోడ్డుపై గర్భిణీ పురిటి నొప్పులతో బాధ పడుతుంటే ఎవరు పట్టించుకోకపోయిన ఓ చిట్టి తల్లి ఆ మహిళకు సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ గర్భిణీ తన ఆరోగ్య చెకప్ నిమిత్తం ఆస్పత్రికి ఆటోలో వెళ్తుంది. మార్గం మధ్యలో ఆటో పంక్చర్ అయింది. దీంతో చేసేది ఏమిలేక ఆటో డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. ఇంతలో ఆ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ అటుగా వెళ్తున్న వాహనదారులను సహాయం చేయాలని అడుగుతున్నాడు. ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ అటుగా కారులో వెళ్తున్న చిన్నారి ఆ దృశ్యాన్ని చూసి చలించింది. అందుకేనేమో ముందుకు వెళ్లిన ఆ చిన్నారి కారు తిరిగి వెనకి వచ్చి ఆ గర్భిణి వద్ద ఆగింది. కారులో నుంచి దిగిన చిన్నారి తల్లి ఆమెకు నీళ్లు ఇచ్చింది. అంతటితో వదిలేయకుండా ఆ చిన్ని హృదయానికి పెద్ద ఆలోచన తట్టినట్టుంది.
ఆమెను స్వయంగా తన కారులో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చింది. తమ కళ్ల ముందు ఎంతో మంది ప్రమాద బారిన పడి అల్లాడుతుంటే మాకెందుకలే అని వదిలేసే వాళ్లు ఉన్న కాలం ఇది. ఇలాంటి కాలంలో కూడా ఈ చిన్నారి చూస్తే మానవత్వం ఎక్కడో కొంచె బ్రతికే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. చిట్టి తల్లి నీ పెద్ద హృదయానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
No words 🥺❤️pic.twitter.com/PeIquRTmjS
— Saran Vjay | BEAST | MSD🔥 (@Saran_VjayJr) December 6, 2021