ఆ మద్య ఓ వ్యక్తి విమానం రెక్కల కింద నక్కి గాల్లో ప్రయాణం చేస్తూ మరో ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాడు. అతడు దాదాపు పదహారు వందల కిలో మీటర్లు సుమారు మూడు గంటల పాటు ప్రయాణించాడు. ఎయిర్ పోర్ట్ లో సిబ్బంది గమనించి దించివేశారు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఒక వ్యక్తి ఏకంగా రైల్ ఇంజన్ వద్ద కూర్చొని ప్రయాణం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. దాహం దాహం అంటూ మూలుగు వినిపించడంతో రైల్ సిబ్బంది గమనించి అతనిని దించాలని ప్రయత్నించేలోగా కనిపించకుండా పారిపోయాడు. వివరాల్లోకి వెళితే..
బుద్ద పూర్ణిమ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ కి ఇంజన్ వద్ద ఎదో ఒక మూలుగు శబ్దం వినిపించింది. అక్కడ ఎవరో దాహం అంటూ ఏడుస్తున్నట్టుగా గమనించాడు. రైలు ఆగిన తర్వాత ఇంజన్ కింద భాగాన్ని లైట్ వేసి పరిశీలించాడు. అక్కడ ఓ వ్యక్తి తనకు దాహంగా ఉందని.. మంచినీళ్లు కావాలని దీనంగా వేడుకుంటున్నట్లు గుర్తించాడు. కొంతమంది ప్రయాణీకుల సహాయం తీసుకొని ఆ యువకుడిని బయటకు లాగారు.. కానీ కొద్ది సేపటి తర్వాత అతడు అక్కడ నుంచి పరార్ అయ్యాడు. అయితే యువకుడు ఎవరు.. ఎక్కడ నుంచి ప్రయాణం చేశాడు అన్న వివరాలు తెలియరాలేదు.
ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత కాబోయే భార్యతో సరదాగా గడుపుతున్న RP.. ఫొటోస్ వైరల్!
ఈ విషయం ట్రైన్ డ్రైవర్ వెంటనే రైల్వే పోలీసులకు తెలియజేశాడు. అయితే ఆ యువకుడి మానిసక పరిస్థితి సరిగా లేదని అందుకే అలా చేశాడని.. దాహం వేయడంతో మంచినీళ్ల కోసం కేకలు వేశాడని అధికారులు తెలిపారు. బహుషా ఆ యువకుడు రాజ్ గిరి ప్రాంతంలో ట్రైన్ ఎక్కి ఉండొచ్చు అని భావిస్తున్నారో పోలీసులు. ఏది ఏమైనా ఎంతో వేడిగా ఉండే ఇంజన్ వద్ద ప్రయాణించినప్పటికీ ఆ యువకుడు క్షేమంగా బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.