బోరు బావుల్లో అభంశుభం తెలియని పసి పిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా బోరు బావుల్లో, ఎండిపోయిన గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ గుర్రం కూడా బోరు బావి లో పడింది.
కొందరు మనుష్లు చేసే పనుల కారణంగా ప్రకృతి నాశనమవ్వడమే కాక మూగ జీవాలను సైతం ఇబ్బందులు పెడుతున్నాయి. ఇష్టాను రీతీలో బావులు వేసి.. ఉపయోగం లేని తరువాత వాటిని అలానే వదిలేస్తారు. దీంతో ఆ బోరు బావుల్లో అభంశుభం తెలియని పసి పిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా బోరు బావుల్లో, ఎండిపోయిన గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ గుర్రం కూడా బోరు బావి లో పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతంలోని ఓ కొత్త ఇంట్లో కట్టిన బావిలో గుర్రం పడింది. ఆ నీటి సంపులో పడిన గుర్రం చాలా సమయం పాటు నరకయాతన అనుభవించింది. గుర్రం బావిలో పడ్డటాని గుర్తించించిన స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. చాలా సమయం పాటు శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అగ్నిమాపక సిబ్బంది వారికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలో పడిన గుర్రాన్ని తీసేందు విశ్వ ప్రయత్నాలు చేశారు. రెండు గంటల పైగా శ్రమించి చివరకు అతికష్టం మీద గుర్రాన్ని బయటకు తీశారు. నీరు తక్కువగా ఉండటంతో బయట పడింది కానీ.. నిండ ఉంటే ప్రాణాలు కోల్పోయేది.
ఆ బావి వెడల్పులు తక్కువగా ఉండటంతో అందులో ఇరుక్కపోయి.. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అయితే ఆ ఇంటి యజమానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత కొత్త ఇళ్లు కట్టించుకున్న మనిషి.. ఆ సంపుకు పైన కప్పు ఏర్పాటు చేసుకోలేవ అంటూ అగ్రం వ్యక్తం చేశారు. అదే పిల్లలు పడి ఉంటే వారి ఏంటనే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎండి పోయిన బోరుబావులను, గుంతలను అలానే వదిలేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.