గురువు అంటే విద్యార్థుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వ్యక్తి. అయితే నేటికాలంలో కొందరు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొందరు మాత్రం విద్యార్థుల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు..
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, ఉన్నతమైన స్థితిలోకి వెళ్లడంలో గురువులదే కీలక పాత్ర. వారు నిరంతరం పిల్లలలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచిమార్గంలో పయనించేందుకు సాయపడుతుంటారు. అయితే కొందరు విద్యార్ధులు చదువుపై ఆసక్తి చూపించలేకపోతుంటారు. అలాంటి వారిని సైతం గురువులు తమదైన నైపుణ్యంతో చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తుంటారు. అందుకోసం ఆటపాటలతో పాఠాలను బోధించడం చేస్తుంటారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అమితాబ్ బచ్చన్ గా అవతారం ఎత్తారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో మాదిరిగా ‘కౌన్ బనేగా ఇంటెలిజెంట్ చైల్డ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్ధుల్లో విజ్ఞానం పెంచడం కోసం ఆ టీచర్ చేస్తున్న వినూత్న కార్యక్రమానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వచ్చిన అతిపెద్ద రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. ఇక ఈ షో గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. అమితాబ్ బచ్చన్ కారణంగానే ఈ షో లోని ప్రతి ఎపిసోడ్ విజయవంతగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ షోలో గేమ్ ఆడటానికి వచ్చిన కంటెస్టెంట్ లతో బిగ్ బి మాట్లాడే విధానం, నడుచుకునే తీరు కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ కార్యక్రమం టీవీ షో లలో అత్యధిక రేటింగ్ ను సాధించింది.
ఇప్పటికే అనేక సీజన్ల పూర్తి చేసుకుంది. ఇక ఈ షోను చూసేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యం పిల్లల్లో ఈ షోపై ఎంతో ఆసక్తి ఏర్పడింది. హాట్ సీటులో కూర్చుని ప్రశ్నలు అడగటం, కంటెస్టెంట్ సమాధానం చెప్పే విధానం పిల్లలను తెగ ఆకట్టుకుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే కొందరు పిల్లలు ఈ తరహా షోను ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఓ టీచర్ కూడా అమితాబ్ బచ్చన్ గా అవతారం ఎత్తారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ కు చెందిన సత్యేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠాలను బోధించడంలో ఆయన వైవిధ్యతను ప్రదర్శిస్తారు. అంతేకాకా పిల్లలతో కలిసిపోయి పాఠాలు బోధించేవారు. లాస్ బెంచ్ విద్యార్ధికి కూడా పాఠాలు అర్ధమయ్యేలా బోధించడం సత్యేంద్ర ప్రత్యేకత. సోషల్ మీడియాలో, టీవీల్లో బాగా ట్రెండ్ అయ్యేవాటిని అనుసరిస్తూ పిల్లలకు పాఠాలను బోధించే వారు. తాజాగా ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తరహాలో.. ‘కౌన్ బనేగా ఇంటెలిజెంట్ చైల్డ్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగే విధంగా సత్యేంద్ర కృషి చేస్తున్నారు.
ప్రతి శనివారం భోజన విరామ సమయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించేవారు. విద్యార్థులను పాఠ్యాంశాలు, వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. గెలిచిన విద్యార్ధులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమం కారణంగా విద్యార్థుల విద్యాప్రగతి పెరిగింది. అలానే పరీక్షల ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండటం విశేషం. పిల్లలపై చికాకు పడే ఉపాధ్యాయులు ఈయనను స్ఫూర్తిగా తీసుకుని పాఠాలు బోధించాలని స్థానికులు కోరుతున్నారు. మరి.. ప్రత్యేక శైలిలో పాఠాలను బోధిస్తున్న ఈ గురువుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.