నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన హృదయవిధారకర దృశ్యాలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారిని లాగి, రోడ్డుపై పడేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పక్కనే ఉన్న యువకుడు కుక్కలను తరమడంతో అమ్మాయి ఆ దాడి నుంచి బయటపడగలిగింది.
భోపాల్ లో వీధి కుక్కల దాడులు అనేవి ఇప్పటి సమస్య కాదు. గతేడాది తల్లి ఉండగానే ఓ ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. 2019లో ఆరేళ్ల చిన్నారిని కుక్కలు దాడి చేసి చంపేశాయి. రక్షించేందుకు ప్రయత్నించిన తల్లికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం భోపాల్ లో లక్షకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి అనే వార్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దాడికి ఎవరిని బాధ్యులను చేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra
— Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022