దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో పూజుల చేసి కోర్కెలు కోరుకుంటారు. ఈ క్రమంలో వివిధ రకాలు దేవుడికి మొక్కులు చెల్లిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా అమ్మవారికి మొక్కు చెల్లించాడు. పాడెపై శవంలా ఆలయానికి వచ్చి.. అమ్మవారికి మొక్క చెల్లించాడు. ఈ వింత ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని సేలం జిల్లాలో జారికొండాలంపట్టి లోని మారియమ్మన్ కాళియమ్మ ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతుంటాయి. అనేక మంది భక్తులు ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అలానే ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ భక్తుడు శవంలా వేషం వేసుకుని పాడెపై ఆలయానికి వచ్చి.. మొక్కు తీర్చుకున్నాడు. మొదట కొండలంపట్టిలోని బస్టాండ్‌లో పందిరి వేసి భక్తుడికి శవానికి చేసే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి అంతిమయాత్ర నిర్వహించారు.
పాడెపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్లిన కోడిని పూడ్చిపెట్టి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పాడెపై నుంచే భక్తుడు అమ్మవారిని దర్శించుకున్నాడు. విచిత్రంగా జరిగిన ఈ మొక్కు చెల్లింపును చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదేం మొక్కు నాయనా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.