అతడో కానిస్టేబుల్. బాధత్య గల వృత్తిలో ఉంటూ పీకల దాక తాగి నడి రోడ్డులో బైక్ పై నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
బాధ్యత గల వృత్తిలో ఉండి కొందరు పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. డ్యూటీలో ఉండి కూడా ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తూ పోలీస్ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ పోలీస్ ఆఫీసర్ పీకల దాక తాగి బైక్ పై నిద్రపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
మన దేశంలో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. కానీ. అలాంటి నమ్మకాన్ని కొందరు పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా పోలీస్ అధికారులతో ఎస్సై, సీఐలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం. అంతేకాకుండా డ్యూటీలో ఉంటూనే మద్యం తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి.. పీకలదాక తాగి బైక్ పైనే నిద్రపోయాడు. దీనిని గమనించిన కొందరు వాహనదారులు అతడిని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆ కానిస్టేబుల్ నిద్రపోతుండగా వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారి చివరికి పోలీసుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలు చూసిన చాలా మంది అతడి తీరుపై ఆగ్రహంతో ఉగిపోతున్నారు. డ్యూటీలో ఉండి ఇదేం పని అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మీ లాంటి వల్లే పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని మరికొందరు వాపోతున్నారు. డ్రెస్ లో ఉండి తాగి పడుకున్న ఈ కానిస్టేబుల్ తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 8, 2023