నేటికాలంలో జన్మించిన వారిలో చాలా మంది చిన్న వయస్సులోనే ఏదో ఒక అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ కొన్నేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే… ఆ కాలంలో జన్మించిన వారు ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వారికి సాధ్యమైన పనులు చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవనాన్ని గడుపుతున్నారు. చురుకుగా కదలడం, హుషారుగా పరుగులు తీయడం, ఉత్సాహంగా అందరితో కలిసి మాట్లాడటం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కానీ పంజాబ్ కు చెందిన ఓ 72 ఏళ్ల వృద్ధుడిని చూస్తే ఎవ్వరైనా ఔరా ఆశ్చర్యపోవాల్సిందే. పండు ముసలి వయసులో కూడా జింకలా పరుగు పందాల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. పంజాబ్ లో జరిగిన ఓ రన్నింగ్ రేస్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
పంజాబ్ లోని లుథియానాలో మినీ ఒలింపిక్స్ క్రీడాలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఎంతో హోరాహోరీగా జరుగుతున్నాయి. యువతి, యువకులతో పాటు పిల్లలు, వృద్ధులు సైతం ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మినీ ఒలిపింక్స్ లో భాగంగా పెట్టిన పరుగు పందెం పోటీల్లో వృద్ధులు అదరగొట్టారు. 70 ఏళ్ల పై బడిన వారు సైతం తగ్గేదేలే అంటూ శనివారం జరిగిన పరుగుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సురీందర్ శర్మ అనే 72 ఏళ్ల వృద్ధుడు అందర్ని ఆకట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఆయన బంగారు పతాకాన్ని సాధించారు. అలానే 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ రేసులో కూడా సురీందర్ శర్మ పాల్గొన్నారు.
ఏడు పదుల వయస్సులోనూ 25 ఏళ్ల కుర్రాడిలో చలాకీగా సురీందర్ శర్మ కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అక్కడి వచ్చిన ఇతర పోటీదారులు, ప్రేక్షకులు ఆయనను ఎంతో ఆసక్తిగా చూశారు. 70 ఏళ్ల ఎంతో ఆరోగ్యంగా ఉండటం వెనుక రహస్యం ఏంటని ఆక్కడి వారు ప్రశ్నిచారు. తాను పలు రకాల ఆరోగ్య నియమాలు పాటించటం తో నేటికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని సురీందర్ శర్మ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” నేను రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తాను. అలానే మానసిక ప్రశాంతత కోసం యోగా కూడా చేస్తూ ఉంటాను. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటాను.
పంజాబ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే పోటీలకు వెళ్తుంటాను. నేటితరం యువత కూడ తమ శరీర ధారుడ్యం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద వహించాలి. చెడు వ్యసనాలకు చాలా దూరంగా ఉండాలి” అంటూ యువతకు సురీందర్ శర్మ సలహాలు ఇచ్చారు. ఇక ఈ పోటీల్లో 70 ఏళ్ల బల్బీర్ సింగ్ అనే వృద్ధుడు, 74 జైర్నల్ సింగ్ అనే వృద్ధుడు కూడా పాల్గొన్నారు. ఇలా పరుగు పందెలా పోటీల్లో వృద్ధులు పాల్గొన్ని ఆరోగ్యంపై యువతకు గట్టి సందేశాన్ని ఇస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. 72 ఏళ్ల వృద్ధుడు రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.