95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ అయిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా వారి దగ్గర ఉన్న 5 నెలల ఏనుగు పిల్ల చనిపోయింది.
95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ అయిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ డాక్యుమెంటరీలో నటించిన తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఏనుగులతో మమేకమై జీవిస్తున్నారు వారు. అయితే వారి సంరక్షణలో ఉన్న ఓ ఏనుగు పిల్ల మృతి చెందిన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. మార్చి 11న గుంపు నుంచి తప్పిపోయిన ఆ గున్న ఏనుగు వ్యవసాయ బావిలో పడిపోయింది. దాంతో తీవ్రంగా ఆ ఏనుగు పిల్లకు గాయాలు కావడంలో అటవీ అధికారుల సంరక్షణలో ఉంది. తాజాగా ఆ గున్న ఏనుగు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది.
ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ద్వారా విశేష గుర్తింపు పొందారు తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు. తాజాగా వీరి సంరక్షణలో ఉన్న 5 నెలల వయసున్న గున్న ఏనుగు పిల్ల మృతి చెందింది. అనుకోకుండా గుంపు నుంచి తప్పిపోయిన గున్న ఏనుగు వ్యవసాయ బావిలో పడి గాయాలపాలైంది. దాంతో వైద్యులు దానికి చికిత్స అందిచారు. అనంతరం ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆ పిల్ల ఏనుగును గుంపులో కలిపేందుకు ట్రై చేశారు. కానీ ఆ ఫలితాలేవీ ఫలించలేదు. దాంతో బొమ్మన్ దంపతుల దగ్గరకే ఆ ఏనుగు పిల్లను చేర్చాలని అధికారులు భావించారు. అందులో భాగంగానే ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ కు తరలించారు.
అయితే కొన్ని రోజులుగా ఆ గున్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ ఏనుగు ఆరోగ్య పరిస్థితి విషమించి, శుక్రవారం (మార్చి 31న)ఆ గున్న ఏనుగు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బొమ్మన్ దంపతుల దగ్గరకు మరో ఏనుగు పిల్ల వచ్చింది. కొన్ని రొజులు క్రితం దాని తల్లి చనిపోవడంతో.. 4 నెలల వయసున్న ఏనుగు పిల్లను వారు సంరక్షిస్తున్నారు. ఆ ఏనుగు పిల్లతో వారు సరదగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే? మార్చి నెలలోనే 5 ఏనుగులు చనిపోవడం బాధాకరమైన విషయం.
Oscar-Winning Couple Bomman And Bellie Are Foster Parents To Another Orphaned Baby Elephant.#TNShorts #TheElephantWhisperers #Bomman #Bellie pic.twitter.com/pN920wsQhT
— TIMES NOW (@TimesNow) March 26, 2023